Hyderabad Police Alert: ఓటీపీలు అడగరు, లింక్ క్లిక్ చేయమనరు… జస్ట్ నో అంటే చాలు అకౌంట్లో డబ్బు మాయం | తెలంగాణ వార్తలు | ACTPnews

Hyderabad Police Alert: ఓటీపీలు అడగరు, లింక్ క్లిక్ చేయమనరు... జస్ట్ నో అంటే చాలు అకౌంట్లో డబ్బు మాయం | తెలంగాణ వార్తలు


▶️’NO’ అంటే.. బ్యాంకు ఖాతా ఖాళీ!


▶️ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు!

▶️వాట్సాప్ సందేశంతోనే క్షణాల్లో సొమ్ము స్వాహా!

▶️ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్‌తో కేటుగాళ్ల సరికొత్త పన్నాగం!

వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం ‘NO’ అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా క్షణాల్లో నిలువునా ఖాళీ అయిపోయింది! బాధితుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పలేదు.. ఏ అనుమానాస్పద లింక్‌పైనా క్లిక్ చేయలేదు.. కేవలం ‘NO’ అనే రెండక్షరాల సమాధానమే జీవితకాల సంపాదనను తుడిచిపెట్టేసింది.

ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం నా దృష్టికి వచ్చింది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇది!

ఈ మోసం ఎలా జరుగుతోందంటే.. మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ‘మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది’ అంటూ నకిలీ సందేశం వస్తుంది.

ఆ వెంటనే మిమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తూ.. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో మెసేజ్ పంపుతారు.

ఖాతాలో డబ్బులు పోయాయన్న కంగారుతో మీరు ‘NO’ అని టైప్ చేసి పంపిన మరుక్షణమే.. ఆ సందేశంలో కనిపించకుండా దాగి ఉన్న మాల్‌వేర్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. క్షణాల్లో మీ మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణను హ్యాకర్లు చేజిక్కించుకుని, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతటినీ ఊడ్చేస్తారు.

అందుకే ప్రజలందరికీ విజ్ఞ‌ప్తి ఏంటంటే… గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు ‘YES’ గానీ, ‘NO’ గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వకండి!

కంగారుపడి ఎలాంటి సమాధానమూ పంపకుండా వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయండి.

మీ ఖాతాలో డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీ అధికారిక బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోండి తప్ప, వాట్సాప్ సందేశాలను అస్సలు నమ్మకండి.

ఏ అధికారిక బ్యాంకూ వాట్సాప్‌లో ఇలా సమాధానాలు కోరదు. ఒకవేళ ఎవరైనా ఈ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్‌లో వెంటనే ‘1930’ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా https://t.co/bdJLRXbJD3 లో ఫిర్యాదు చేయండి.

కంగారులో ఇచ్చే ఒక్క నో అనే సందేశం మీ సర్వస్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!!

#CyberCrimeAlert #WhatsAppScam #StayAlert #CyberSecurity #HyderabadPolice

— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) October 12, 2026



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed