Chiranjeevi: 70 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్.. మెగాస్టార్ డెడికేషన్‌ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్‌లో డెడికేషన్ అంటే గుర్తొచ్చేవాళ్లలో మెగాస్టార్ ఒకరు. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడు అని ఎందరో గొప్ప గొప్ప దర్శకులు, నటులు నోటి నుంచి విన్నాం. మాములుగా హీరోలు ఒక ఏజ్ వచ్చాక.. అన్ని చాలించుకుంటారు. వయసుకు తగ్గట్లు సినిమాలు చేసుకుంటూ పోతారు.

News18
News18

టాలీవుడ్‌లో డెడికేషన్ అంటే గుర్తొచ్చేవాళ్లలో మెగాస్టార్ ఒకరు. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడు అని ఎందరో గొప్ప గొప్ప దర్శకులు, నటులు నోటి నుంచి విన్నాం. మాములుగా హీరోలు ఒక ఏజ్ వచ్చాక.. అన్ని చాలించుకుంటారు. వయసుకు తగ్గట్లు సినిమాలు చేసుకుంటూ పోతారు. కానీ, మెగాస్టార్ మాత్రం సినిమాకు వయసుతో పనేముంది.. చేయాలన్న కసి, తపన ఉంటే చాలు అనే రేంజ్‌లో అదరగొట్టేస్తుంటాడు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

సినిమా కోసం ఎంత కష్టం అయిన భరించే మెగాస్టార్.. ఇప్పుడు ఏకంగా తన ఒళ్లును కూడా హూనం చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం మెగాస్టార్, బాబీ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు మళ్లీ వీళ్ల కాంబోలో సినిమా రావడంతో ఆడియెన్స్‌లో బీభత్సమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక తాజాగా చిరంజీవి జిమ్‌లో తెగ కష్టపడుతూ వర్కవుట్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. బాబీతో చేయబోయే సినిమాకు సంబంధించిన ముహూర్తం మే 21న జరుగుతున్నట్లు తెలిపాడు. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌లు త్వరలోనే రానున్నాయి. ఇక దీనితో పాటుగా ప్రస్తుతం ఆయన నటించిన విశ్వంభర మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. డెబ్యూ సినిమా బింబిసారతో మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్న మల్లిడి వశిష్ట.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరీ ఈ సారైనా రిలీజవుతుందా అనేది చూడాలి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గా ఎమ్.ఎమ్ కీరవాణి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.

దీనితో పాటుగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమాకు సైన్ చేశాడు. నాని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు స్క్రిప్ట్ దశలో ఉంది. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్న శ్రీకాంత్ ఓదెలా.. ఆ సినిమా పూర్తవ్వగానే మెగాస్టార్‌తో చేయబోయే సినిమాలో బిజీ కాబోతున్నాడు. ఈ సినిమా మొత్తం బ్లడ్ బాత్ అనే రేంజ్‌లో ఉండబోతుందట. ఈ మూవీ విలేజ్ రూరల్ బ్యాక్ గ్రాప్ కథతో తెరకెక్కనుందని సమాచారం.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *