Chiranjeevi: పర్సంటేజీ వివాదానికి చిరంజీవి ఫుల్‌స్టాప్.. పెద్ది మూవీకి లైన్ క్లియర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

చిరంజీవి (FILE Image)


Last Updated:

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు), నిర్మాతలకు మధ్య నడుస్తున్న ‘పర్సంటేజీ వర్సెస్ రెంటల్’ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో పెద్ది మూవీకి లైన్ క్లియర్ అయింది.

చిరంజీవి (FILE Image)
చిరంజీవి (FILE Image)

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు), నిర్మాతలకు మధ్య నడుస్తున్న ‘పర్సంటేజీ వర్సెస్ రెంటల్’ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. థియేటర్లను అద్దె (రెంటల్) ప్రాతిపదికన కాకుండా, టికెట్ కలెక్షన్లలో పర్సంటేజీ (వాటా) మోడల్‌లోనే నడపాలని ఎగ్జిబిటర్లు గట్టి పట్టుబట్టారు. ఈ వివాదం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో, టాలీవుడ్ పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. మే 25న ఎగ్జిబిటర్లతో ప్రాథమికంగా భేటీ అయిన ఆయన, తాజాగా మరోసారి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చిరంజీవి సమక్షంలో జరిగిన ఈ కీలక సమావేశంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన ఒక మధ్యేమార్గ నిర్ణయాన్ని తీసుకున్నారు.

దీని ప్రకారం.. జూన్ 4న విడుదలవుతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాను పాత పద్ధతిలోనే, అంటే రెంటల్ విధానంలోనే ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు అంగీకరించారు. అయితే, జూన్ 30 తర్వాత థియేటర్లలోకి వచ్చే కొత్త సినిమాలన్నింటికీ పర్సంటేజీ విధానాన్ని వర్తింపజేసేలా ఒప్పందం కుదిరింది. చిరంజీవి చొరవతో ఈ సమస్య సామరస్యంగా ముగియడంతో ‘పెద్ది’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. రూరల్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేసింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ కథాంశంతో, ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా ఉండబోతున్నట్లు ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ స్పష్టం చేశాయి.

ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. థియేట్రికల్ వివాదాలన్నీ సర్దుమణగడంతో జూన్ 4న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని మెగా అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports