Last Updated:
రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా పెద్ది ఎట్టకేలకు థియేటర్స్ లో అడుగుపెట్టింది. తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా పెద్ది ఎట్టకేలకు థియేటర్స్ లో అడుగుపెట్టింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు అనగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు.
మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ భారీ కాంబినేషన్ జూన్ 4న థియేటర్లలో అడుగుపెట్టడం, పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా విజయంపై రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి జనానికి ఊపునిచ్చే ట్వీట్ చేశారు.
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026
”నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. పెద్ది పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాతలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శివరాజ్ కుమార్ గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతి బాబు గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన రెహ్మాన్ గారికి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన రత్నవేలు గారికి, ఈ సినిమా విజయంలో భాగమైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor), దివ్యేందుతో పాటు సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. “పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తన ట్వీట్ లో చిరంజీవి పేర్కొన్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













