Cognizant Job: ఆ రాత్రంతా ఏడ్చాను.. తన డ్రీమ్ జాబ్ పొందిన తర్వాత కాగ్నిజెంట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్ట్ వైరల్ | ట్రెండింగ్ | ACTPnews

News18


Last Updated:

Cognizant Job: నాలుగేళ్లలో రెండుసార్లు తిరస్కరణకు గురైన తర్వాత, ఒక మహిళ చివరకు తాను ఒకప్పుడు కలలు కన్న సంస్థలో చేరి, సంవత్సరాల తరబడి ఉన్న మెసేజ్‌ని తను ఎన్నటికీ మరచిపోలేని క్షణంగా మార్చుకుంది.

News18
News18

Cognizant Job: కొందరికి కెరియర్‌పై స్పష్టత ఉంటుంది. కచ్చితంగా నేను ఈ ఉద్యోగమే చేయాలి.. ఫలానా కంపెనీలోనే ప్లేస్‌మెంట్ వస్తే బాగుంటుందని కలలు కంటారు. అయితే కలను నిజం చేసుకోవడం అంత సులువైన విషయం కాదని కాగ్నిజెంట్‌లో చెన్నైకి చెందిన సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ మహేశ్వరి మోహన్ లింక్డ్‌ఇన్‌లో తన జాబ్ జర్నీ గురించి .. తనకు ఎదురైన చేదుఅనుభవాలు, సవాళ్లు, అవాంతరాలను గురించి వివరంగా అందరితో షేర్ చేసుకుంది.

అనుకున్నది జరగడం అంత సులువు కాదు..

కాగ్నిజెంట్‌లో జాబ్ సంపాదించాలన్న తన సంవత్సరాల ప్రయత్నం తర్వాత చివరకు ఉద్యోగంలో చేరిన తర్వాత మహేశ్వరి మోహన్ అనే ఒక మహిళ పెట్టిన లింక్డ్‌ఇన్ పోస్ట్ ఆన్‌లైన్‌లో చాలా మంది నిపుణులను కదిలించింది. తాను ఎంతోకాలంగా ఆశించిన అవకాశం చివరికి దక్కించుకోవడానికి ముందు ఒకసారి కాదు రెండుసార్లు తిరస్కరణకు గురైనట్లు ఆమె ఆ పోస్ట్‌లో పంచుకున్నారు.కెరీర్‌లో ఎదురుదెబ్బలు తిన్నవారికి ఆమె కథ బాగా నచ్చింది. విజయం ఎప్పుడూ మొదటి ప్రయత్నంలోనే రాదని ఇది వారికి గుర్తుచేస్తుంది.

రెండు సార్లు రిజక్ట్..

చెన్నైకి చెందిన సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ మహేశ్వరి మోహన్ తాజాగా లింక్డ్‌ఇన్‌లో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. కాగ్నిజెంట్ ఎల్లప్పుడూ తన కలల కంపెనీ అని కానీ అక్కడ ఉద్యోగం పొందడం అంత సులభం కాదని ఆమె పోస్ట్ ద్వారా చెప్పింది. మహేశ్వరి మోహన్ పోస్ట్ ప్రకారం 2022లో జరిగిన కాలేజ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ సమయంలో ఆమె మొదటి ప్రయత్నం జరిగింది. అయితే అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. “కాలేజ్ క్యాంపస్ డ్రైవ్‌లో కాగ్నిజెంట్ (Cognizant) తనను రిజక్ట్ చేసిందని .. ఆ రాత్రంతా తాను ఏడ్చానంటూ చెప్పుకొచ్చింది.

రెండో సారి ఫెయిల్..

కెరియర్‌లో స్థిరపడాలన్న ఆశయం మొదటి ప్రయత్నం రిజక్ట్ రూపంలో ఎదురుదెబ్బ తగలడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. కానీ ఆమె ప్రయత్నం విరమించలేదు. ఒక సంవత్సరం తర్వాత అంటే 2023 జూన్‌లో మహేశ్వరి ఒక ‘వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్’కు హాజరైంది. మరోసారి ఆమె జాబ్ సెలక్షన్ ప్రాసెస్‌లో లాస్ట్ స్టేజ్‌కి చేరుకుంది. కాని ఉద్యోగ అవకాశం చేజార్చుకుంది. అంటే రెండోసారి కూడా మహేశ్వరి జాబ్‌కి సెలక్ట్ కాలేదు.

పదే పదే అదే ఆలోచన..

ఆ కాలాన్ని గుర్తుచేసుకుంటూ మహేశ్వరి మోహన్ పోస్టులో ఈవిదంగా రాసింది. రెండోసారి రిజక్ట్ అయిన తర్వాత తనలో తానే అనుకునేది. కాగ్నిజెంట్‌లో (Cognizant)జాబ్ సంపాధించే అర్హత తనకు లేదమోనని తీవ్రంగా మనోవేదనకు గురయ్యేదాన్ని అంటూ పేర్కొంది.

HCLTech ఒక కీలక మలుపు..

రెండుసార్లు జాబ్‌కు రిజక్ట్ అయిన తర్వాత అంటే 2023లో మోహన్ HCLTechలో చేరారు. తన వృత్తిపరమైన ప్రయాణంలో ఆ అనుభవం ఒక ముఖ్యమైన దశ అని ఆమె పేర్కొన్నారు. అది తనకు వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఎదగడానికి సహాయపడిందని మహేశ్వరి తన పోస్ట్ ద్వారా తెలిపారు. ఆమె కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, అనుభవాన్ని సంపాదిస్తున్నప్పటికీ, కాగ్నిజెంట్‌లో చేరాలనే లక్ష్యాన్ని తాను పూర్తిగా వదులుకోలేదని ఒప్పుకుంది. HCLTechలో గడిపిన సమయం, భవిష్యత్తులో రాబోయే అవకాశాలకు తనను సిద్ధం చేస్తూ, నేర్చుకోవడానికి , మెరుగుపడటానికి సహాయపడిందని ఆమె రాసింది.

ఒక ఊహించని కాల్ పరిస్థితులను మార్చేసింది..

రెండవసారి తిరస్కరణకు గురైన చాలా సంవత్సరాల తర్వాత మోహన్‌కు లింక్డ్‌ఇన్ ద్వారా కాగ్నిజెంట్ రిక్రూటర్ నుండి రియల్-టైమ్ అనలిస్ట్ (RTA) పదవికి సంబంధించి ఒక ఊహించని మెసేజ్ వచ్చింది. ఈసారి ఫలితం భిన్నంగా ఉంది. ఆమె అన్ని ఇంటర్వ్యూ రౌండ్‌లను క్లియర్ చేసి ఆ ఉద్యోగాన్ని దక్కించుకుంది. జూన్ 2026లో తన మొదటి ప్రయత్నం తర్వాత నాలుగు సంవత్సరాలకు ఆమె అధికారికంగా కాగ్నిజెంట్‌లో చేరారు. ఆ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ మహేశ్వరి మోహన్ ఇలా రాశారు, “నాలుగేళ్లు ఆలస్యం. కానీ 2022లో కొత్తగా చేరినప్పటి కంటే ఇప్పుడు 10 రెట్లు ఎక్కువగా సిద్ధంగా ఉన్నాను అంటూ తన కలను నెరవేర్చుకున్న గర్వంతో తెలిపింది.

ఆమె అనుభవంతో ప్రజలు ఏకీభవిస్తున్నారు

చివరికి విజయం సాధించడానికి ముందు తిరస్కరణను ఎదుర్కోవడం తమకు కూడా అనుభవమేనని చెప్పిన చాలా మంది వినియోగదారుల నుండి ఆమె పోస్ట్‌కు మద్దతు లభించింది.“తిరస్కరణ అనేది సామర్థ్యాన్ని నిర్వచించదనే దానికి ఇది ఒక శక్తివంతమైన ఉదాహరణ. కొన్నిసార్లు సమయం సరైనది కాదు కానీ అది ‘సరిపోకపోవడం’ అనేదానికి పూర్తిగా భిన్నమైనది. మీకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించినందుకు అభినందనలు అంటూ ఒక వినియోగదారు కామెంట్ షేర్ చేశారు.

మీ పట్టుదలకు సలామ్..

పట్టుదల నిజంగా ఫలమిస్తుంది.. నేను కూడా చాలా ఉద్యోగాలకు తిరస్కరించబడ్డాను.. నేను కూడా సంవత్సరాల తర్వాత మళ్లీ అప్లై చేసుకొని చివరకు నా స్థానాన్ని కూడా మార్చుకున్నానంటూ మరొకరు కామెంట్ పెట్టారు. చివరికి కాగ్నిజెంట్‌లోని ఒక ఉద్యోగంతో సహా నాకు ఉపాధి లభించిందని పేర్కొన్నారు. కాలంతో పాటు కొన్ని జరుగుతాయి అని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. “మీ పట్టుదల స్ఫూర్తిదాయకం అంటూ చాలా మంది మహేశ్వరి మోహన్‌ పట్టుదలను మెచ్చుకుంటూ రిప్లైలు ఇస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *