Coimbatore petrol bomb attack: ఇవేం పనులు రా బాబు.. ప్రేమను తిరస్కరిస్తే పెట్రోల్‌తో ఇలా చేస్తారా? కోయంబత్తూరులో రౌడీషీటర్ ఘాతుకం! | | ACTPnews

ప్రేమను నిరాకరించిన యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు వేసిన దృశ్యం


Last Updated:

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా తొండముత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో యువతి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా తగలబడటమే కాకుండా, ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది.

ప్రేమను నిరాకరించిన యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు వేసిన దృశ్యం
ప్రేమను నిరాకరించిన యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు వేసిన దృశ్యం

Coimbatore petrol bomb attack: ప్రేమ పేరుతో వెంటపడటమే కాకుండా, తనను దూరం పెట్టిందనే కక్షతో ఓ యువతి ఇంటిపై రౌడీషీటర్ పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడిన దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా తొండముత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో యువతి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా తగలబడటమే కాకుండా, ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

కేసు వివరాలు

పోలీసుల కథనం ప్రకారం.. కోయంబత్తూరు సమీపంలోని తొండముత్తూరుకు చెందిన ఒక యువతికి, అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, కార్తీక్ ఒక సాధారణ వ్యక్తి కాదని.. అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఏకంగా 31 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే నిజం సదరు యువతికి తెలిసింది. అతను ఒక రౌడీషీటర్ అని తెలియడంతో, ఆ యువతి అతనితో మాట్లాడటం పూర్తిగా మానేసింది. అంతేకాకుండా అతని ప్రేమ ప్రతిపాదనను సైతం నిరాకరించి, దూరం పెట్టింది.

నడిరాత్రి పెట్రోల్ బాంబులతో దాడి

తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన కార్తీక్, ఆ యువతిపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. దాడికి ముందు ఆమెను చంపేస్తానంటూ పలుమార్లు ఫోన్లలో బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెట్రోల్ నింపిన సీసాలతో యువతి ఇంటిపైకి దూసుకొచ్చాడు.

నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఆ బాంబులను యువతి ఇంటి వరండా పైకి విసిరాడు. బాంబులు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వరండాలో పార్క్ చేసి ఉన్న స్కూటర్‌కు అంటుకోవడంతో అది కాసేపట్లోనే పూర్తిగా కాలిబూడిదైంది.

సీసీటీవీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

భారీ శబ్దం రావడంతో భయపడిపోయిన యువతి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రజలు వెంటనే బయటకు వచ్చి మంటలను ఆర్పివేశారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొండముత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.

స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. కార్తీక్ బైక్‌పై వచ్చి బాంబులు విసిరి, మంటలు అంటుకున్న వెంటనే అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ మేరకు పోలీసులు నిందితుడు కార్తీక్‌పై హత్యాయత్నం, లవ్ హెరాస్‌మెంట్ మరియు ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed