Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా బాక్సర్ల జోరు.. ఒకే రోజు రెండు పసిడి పతకాలు! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్లు సత్తా చాటారు. ఒకే రోజు ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా స్వర్ణ పతకాలు సాధించగా.. పురుషుల విభాగంలో జదుమణి సింగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.

News18
News18

గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్లు చరిత్ర సృష్టించారు. బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులపై పవర్ పంచ్‌లతో విరుచుకుపడి దేశానికి సగర్వంగా ఒకే రోజు రెండు పసిడి పతకాలు అందించారు. మహిళల 54 కేజీల ఫైనల్ పోరులో 22 ఏళ్ల భారత యువ బాక్సర్ ప్రీతి పవార్ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో కెనడాకు చెందిన బలమైన క్రీడాకారిణి స్కార్లెట్ సవన్నా డెల్గాడోపై 5-0 తేడాతో ఏకగ్రీవ నిర్ణయంతో ఘన విజయం సాధించి ఏకంగా స్వర్ణం కొల్లగొట్టింది.

ఆట ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ప్రీతి పవార్, ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. కామన్వెల్త్ అరంగేట్రంలోనే అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకం గెలుచుకుని భారత పతకాల పట్టికలో అమాంతం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ చారిత్రాత్మక విజయంతో భారత్ ఖాతాలో ఈసారి బాక్సింగ్ విభాగంలో తొలి స్వర్ణం చేరింది.

ప్రీతి పవార్ స్వర్ణం సాధించిన కొద్దిసేపటికే మరో భారత బాక్సర్ జైస్మిన్ లాంబోరియా కూడా పసిడి పతకంతో మెరిసింది. మహిళల 57 కేజీల విభాగం ఫైనల్‌లో 24 ఏళ్ల జైస్మిన్ అద్భుత విజయం సాధించింది. శనివారం జరిగిన హోరాహోరీ తుది పోరులో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ మైఖేలా వాల్ష్‌ను ధీటుగా ఎదుర్కొని ఓడించింది.

ఇద్దరు క్రీడాకారిణుల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ ఉత్కంఠ పోరులో జైస్మిన్ తుది నిర్ణయంలో (స్ప్లిట్ డిసిషన్) విజేతగా నిలిచింది. గత కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన జైస్మిన్, ఈసారి తన ఆటను మరింత మెరుగుపరుచుకుని ఏకంగా స్వర్ణం సాధించి తన సత్తా చాటిచెప్పింది. బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి ఈ క్రీడల్లో భారత్‌కు రెండో పసిడి పతకాన్ని అందించింది.

మరోవైపు పురుషుల 55 కేజీల బాక్సింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత యువ బాక్సర్ జదుమణి సింగ్ తీవ్రంగా శ్రమించి దేశానికి రజత పతకం అందించాడు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports