CSK vs GT: సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్.. చెన్నైను చిత్తు చేసిన గుజరాత్ ! | క్రీడా వార్తలు | ACTPnews

credit: x


Last Updated:

గుజరాత్ టైటాన్స్ 159 లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో చేధించి సీఎస్కేపై విజయం, సాయి సుదర్శన్ 87, శుభమన్ గిల్ 33, జాస్ బట్లర్ 39, సీఎస్కేకు రుతురాజ్ గైక్వాడ్ 74 వృథా.

credit: x
credit: x

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విక్టరీ సాధించింది. సీఎస్కే నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో ఫినిష్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 87 (4 ఫోర్లు, 7 సిక్సులు) పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సాయికి కెప్టెన్ శుభమన్ గిల్ 33 (1 ఫోర్, 3 సిక్సులు), జాస్ బట్లర్ 39 (4 ఫోర్లు, 1 సిక్స్) తోడవడంతో ఛేజింగ్ ఈజీ అయిపోయింది. చెన్నై బౌలర్లకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా.. గుజరాత్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఇక సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, అకెల్ హోసేన్ చెరో వికెట్ పడగొట్టారు.

చెన్నై బ్యాటింగ్ ఇలా..!

గుజరాత్ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ (11) ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 60 బంతుల్లో 74 (6 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. ఉర్విల్ పటేల్ (4), సర్ఫరాజ్ ఖాన్ (0), డెవాల్డ్ బ్రేవిస్ (2), శివమ్ దూబే (22).. ఇలా టాప్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేశారు. ఐతే చివర్లో ఓవర్టన్ 18 (3 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లతో కాసేపు అలరించాడు. కానీ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. ఇక గుజరాత్ బౌలర్లలో రబాడా 3, అర్షద్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుతార్ చెరో వికెట్ పడగొట్టారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports