ఈ నేరం ఎలా జరిగింది?: సైబర్ నేరస్తులు వాట్సాప్లో (లేదా గ్రూపుల్లో) ఆకర్షణీయమైన వివాహ ఆహ్వానాలు, ఈవెంట్ నోటిఫికేషన్లు పంపుతారు. వాటితో పాటు APK ఫైల్ (Android Package Kit) లింకు ఉంటుంది. “వివాహ ఆహ్వానం చూడండి” అని ఆకర్షణీయంగా రాసి పంపుతారు. ఆ లింకును క్లిక్ చెయ్యగానే.. అది ఫైల్ లాగా డౌన్లోడ్, ఇన్స్టాల్ అవుతుంది. ఐతే.. దాంతోపాటూ రహస్యంగా.. మాల్వేర్ కూడా ఫోన్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఫోన్ను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటుంది. OTPలు, బ్యాంక్ యాప్లు, UPI వివరాలు, పాస్వర్డ్లను సేకరిస్తుంది. ఈ APK ఫైల్ ద్వారా హ్యాకర్లు.. దూరం నుంచే మొబైల్ని ఆపరేట్ చెయ్యగలరు. ఆ విషయం బాధితులకు కూడా తెలియదు.














