Daggubati Rana: సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌ అమీర్ లోగ్.. రానా ‘స్పిరిట్ మీడియా’పై భారీ ఎత్తున రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హైదరాబాద్ గల్లీలో ముగ్గురు మిత్రుల కథతో సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌ అమీర్ లోగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రానా ‘స్పిరిట్ మీడియా’పై ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.

News18
News18

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి బయటకొచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్ సాంగ్, టీజర్ ఇలా అన్నీ బజ్‌ను క్రియేట్ చేశాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ చిత్రంగా రాబోతోంది ‘అమీర్ లోగ్’.

రానా ‘స్పిరిట్ మీడియా’ ఈ ‘అమీర్ లోగ్’ మూవీ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని స్పిరిట్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోంది. ఈ చిత్రాన్ని చూసి, అందులోని కంటెంట్ నచ్చి.. రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ గల్లీలోని ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ, వారి ప్రయాణాన్ని, యూత్‌కి ఇచ్చే సందేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అందుకే స్పిరిట్ మీడియా ‘అమీర్ లోగ్‌’ను విడుదల చేయబోతోంది.

ఈ సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed