Last Updated:
సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్, బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2: The Revenge) ఎట్టకేలకు భారతీయ డిజిటల్ స్క్రీన్స్‌పైకి వచ్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్, బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2: The Revenge) ఎట్టకేలకు భారతీయ డిజిటల్ స్క్రీన్స్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో రికార్డుల వేట ముగించుకున్న ఈ చిత్రం, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్ స్టార్’ (JioHotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం సాయంత్రం 7 గంటల నుండి హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ వెర్షన్ కోసం మేకర్స్ ‘రా అండ్ అన్దేఖా’ (Raw & Undekha) పేరుతో థియేటర్లలో కట్ అయిన కొన్ని అదనపు సీన్లను జత చేయడం విశేషం. అంతకుముందు మే 14 నుంచే ఈ చిత్రం ఓవర్సీస్ ప్రేక్షకులకు ‘నెట్ ఫ్లిక్స్’ వేదికగా అందుబాటులోకి వచ్చి అక్కడ కూడా టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. గతేడాది డిసెంబర్లో వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సెకండ్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1,812 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం భారతదేశంలోనే ఈ చిత్రం 1,148 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఈ ఫ్రాంచైజీలోని రెండు భాగాలు కలిపి మొత్తంగా 3,000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.
మొదటి భాగంలో మిగిల్చిన ఎన్నో ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు ఈ సీక్వెల్లో సమాధానాలు ఇచ్చారు దర్శకుడు. కథ విషయానికి వస్తే… దేశభక్తితో సైన్యంలో చేరాలనుకున్న జస్కరిత్ సింగ్ రంగీ (రణవీర్ సింగ్), తన సొంత ఊరిలో జరిగిన ఒక వివాదంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి 15 మందిని చంపేస్తాడు. ఆ తర్వాత జైలు శిక్ష అనుభవిస్తున్న అతడిని ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం భారత ఇంటెలిజెన్స్ రంగంలోకి దించుతుంది. దాంతో అతను ‘హమ్జా’గా పేరు మార్చుకుని పాకిస్తాన్‌లోని ల్యారీ (Lyari) పట్టణానికి వెళ్తాడు. అక్కడ అండర్‌వరల్డ్ డాన్, బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా)ను హమ్జా హతమారుస్తాడు.
అయితే, రెహమాన్ మరణాన్ని ఆసరాగా చేసుకుని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) ల్యారీకి తనే రాజునని ప్రకటించుకుంటాడు. కానీ, తన అన్న రెహమాన్ చావుకి అర్షద్ పప్పు కారణమని భావించిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు. ఈ క్రమంలో ల్యారీ పీఠాన్ని ఉజెయిర్ ఆక్రమించకుండా హమ్జా ఎలాంటి వ్యూహాలు రచించాడు? అసలు జస్కరిత్ సింగ్ అంతలా మారిపోవడానికి వెనుక ఉన్న బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? చివరకు భారతదేశంపై జరగబోయే భారీ ఉగ్రదాడులను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ స్పై థ్రిల్లర్ సాగుతుంది.
ఈ హై-బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ వంటి దిగ్గజ తారాగణం కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను మిస్ అయిన వారు, అలాగే మళ్లీ చూడాలనుకునే వారు జియో హాట్ స్టార్‌లో హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













