Donald Trump: ఇరాన్‌తో యుద్ధం.. కుమారుడి పెళ్లికి వెళ్లేందుకు భయపడుతున్న ట్రంప్ ! | | ACTPnews

News18


Last Updated:

ఇరాన్ ఉద్రిక్తతల నడుమ కొడుకు పెళ్లికి వెళ్లడంపై డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహానికి హాజరైనా, కాకపోయినా మీడియా తనను విమర్శిస్తుందని, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తనకు ఇది సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు.

News18
News18

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఒక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వైట్ హౌస్‌కు సంబంధించినది కాదు, ఆయన పెద్ద కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ పెళ్లికి సంబంధించినది. ఈ వీకెండ్‌లో బహామాస్ వేదికగా బెటినా ఆండర్సన్‌తో డోనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం జరగనుంది. ఐతే కొడుకు పెళ్లికి వెళ్లాలని తనకు ఉన్నప్పటికీ, ఇరాన్‌తో నడుస్తున్న యుద్ధ వాతావరణం, శాంతి చర్చల వల్ల ప్రస్తుత సమయం అస్సలు అనుకూలంగా లేదని ట్రంప్ స్వయంగా విలేకరుల సమావేశంలో అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలు, మీడియాపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పెళ్లికి వెళ్లినా, వెళ్లకపోయినా మీడియా తనను వదిలిపెట్టదని, ఫేక్ న్యూస్ సంస్థలు తనను ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తూనే ఉంటాయని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కొడుకు వివాహానికి హాజరుకావడంపై ట్రంప్ స్పందిస్తూ, ‘నా కొడుకు నన్ను పెళ్లికి రమ్మని కోరుతున్నాడు, నేను వెళ్లడానికి ప్రయత్నిస్తాను. కానీ ప్రస్తుతం నాకు ఇరాన్ వ్యవహారంతో పాటు మరికొన్ని పనులు ఉండటం వల్ల ఇది సరైన సమయం కాదు’ అని పేర్కొన్నారు. ఒకవేళ పెళ్లికి హాజరైతే అంతర్జాతీయ సంక్షోభాన్ని వదిలేసి వేడుకల్లో పాల్గొంటున్నారని విమర్శిస్తారని, వెళ్లకపోతే కొడుకు, కోడలు నొచ్చుకుంటారని ఆయన ఉద్దేశం. ఐతే నెటిజన్లు మాత్రం ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. పెళ్లికి వెళ్లేందుకు భయపడుతున్నారేమో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

డోనాల్డ్ ట్రంప్ జూనియర్ (డాన్ జూనియర్) ట్రంప్ కుటుంబానికి చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ సంస్థలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన తండ్రి రాజకీయ నినాదమైన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (MAGA) ప్రచారంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఆయన భవిష్యత్తులో తాను కూడా దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించడం గమనార్హం.

మరోవైపు, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య వెనెస్సా ట్రంప్ ఇటీవల రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించారు. ఈ పాత బంధం ద్వారా వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. గతంలో వీరి వివాహం భారతదేశంలోని ఉదయ్‌పూర్‌లో భారీ ఎత్తున జరుగుతుందని ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా బహామాస్ దీవుల్లో అత్యంత నిరాడంబరంగా ఈ వివాహ వేడుకను ముగించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports