Last Updated:
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్‌తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. మరోవైపు ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటడం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, భీకర పోరాటం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని శనివారం ఆయన మరోసారి ప్రకటించారు. ఈ ప్రాంతంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హౌతీ తిరుగుబాటుదారులు అమెరికాతో పోరాడటానికి సిద్ధంగా లేరని, అయితే సౌదీ అరేబియా పైప్‌లైన్‌పై జరిగిన డ్రోన్ దాడికి ఇరానే కారణం కావచ్చని ఆయన పేర్కొన్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం తెలిపింది. నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఈ యుద్ధం వెంటనే ముగుస్తుందని గతంలో ట్రంప్ తెలిపారు.














