Last Updated:
మూడు రోజుల ముందు రిలీజైన ‘దృశ్యం-3’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ఫస్ట్ రెండు పార్టులు ఉన్నంత రేంజ్‌లో ఈ థర్డ్ పార్ట్ లేకపోవడంతో థ్రిల్లర్ లవర్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు.
మూడు రోజుల ముందు రిలీజైన ‘దృశ్యం-3’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ఫస్ట్ రెండు పార్టులు ఉన్నంత రేంజ్‌లో ఈ థర్డ్ పార్ట్ లేకపోవడంతో థ్రిల్లర్ లవర్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. టాక్ ఎలా ఉన్న కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. రిలీజ్ రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సృష్టిస్తుంది. నిజానికి ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగా ప్లస్ అయ్యాయి. లాస్ట్ 2 పార్ట్స్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ థర్డ్ పార్ట్‌పై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి.
తెలుగు జనాలు మాత్రం వెంకీమామ లేకపోవడంతో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అసలు తెలుగు డబ్బింగ్ కూడా మనకు కనెక్ట్ అవలేదు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.3.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.3.75 కోట్లు కొల్లగొట్టాల్సి ఉంది. కాగా.. ఇప్పటి వరకు ఈ సినిమాకు తెలుగులో రూ.2.05 కోట్లు కొల్లగొట్టింది. అంటే.. ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం రూ.1.70 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. అయితే సినిమాకు పెద్దగా తెలుగులో బిజినెస్ కాకపోవడంతో.. ఆ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు మంచి కలెక్షన్లే వచ్చాయి.
ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ.29 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.30 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉండగా.. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.51.50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఆల్రెడీ ఈ సినిమాకు రూ.21 కోటకలకు పైగా లాభాలు వచ్చేశాయి. ప్రస్తుతం ఈ సినిమాకున్న జోరు చూస్తుంటే.. ఈ వీక్ కంప్లీట్ అయ్యేలోపు రూ.200 కోట్లు ఈజీగా కంప్లీట్ చేస్తుంది.
ఈ సినిమా కథ విషయాకొస్తే.. దృశ్యం పార్ట్ 2 కథ ఎక్కడైతే ముగిసిందో.. దృశ్యం 3 అక్కడ నుంచే స్టార్ట్ అయింది. వరుణ్ హత్య కేసును హై కోర్టు పూర్తిగా కొట్టేయడంతో జార్జ్ అలియాస్ మోహన్ లాల్ ఫ్యామిలీ పెద్ద గండం నుంచి గట్టెక్కినట్లు ఫీల్ అవుతారు. గతాన్ని మర్చిపోయి హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. అంతేకాకుండా సినిమాల మీద పిచ్చి ఉండే జార్జ్ తన సొంత కథనే ‘దృశ్యం’ పేరుతో సినిమా తీసి హిట్టు కొడతాడు. మరోవైపు తన పెద్ద కూతురు అంజు అలియాస్ అన్సీబా హసన్‌ను పెళ్లి చేయాలని మంచి సంబంధాలు చూస్తుంటాడు. అయితే ఏదో ఒక కారణంతో అంజుకు వచ్చిన సంబంధాలన్ని ఆఖరి నిమిషంలో ఆగిపోతుంటాయి. అప్పుడే జార్జ్‌కు అనుమానం స్టార్ట్ అవుతుంది. దీని వెనుకున్న కారణం ఏంటా అని ఆరాతీయడం మొదలు పెడతాడు. అప్పుడు జార్జ్‌కు కొందరు శత్రువులు పాత పగను మనసులో పెట్టుకుని తన కూతురుకు పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నారని గ్రహిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అంజు పెళ్లికి అడ్డుగా ఉంది ఎవరు? దీని వెనుక వరుణ్ ఫ్యామిలీ హస్తం ఉందా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













