Last Updated:
దృశ్యం సిరీస్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘దృశ్యం 3’ (Drishyam 3) గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ పై పలు చర్చలు నడుస్తున్నాయి.
మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ రంగంలోనే మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రికార్డులు సృష్టించిన ఫ్రాంచైజీ ‘దృశ్యం’ (Drishyam). మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal), నటి మీనా (Meena) ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘దృశ్యం 3’ (Drishyam 3) గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ‘దృశ్యం 3’ డిజిటల్ రైట్స్‌ను అత్యంత భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని టాక్. జూన్ చివరి వారంలో ఈ క్రేజీ థ్రిల్లర్ నేరుగా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాల భోగట్టా. నిబంధనల ప్రకారం చూస్తే ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాతనే ఓటీటీలోకి రావాలి. ఈ లెక్కన చూస్తే దృశ్యం 3 మూవీ కూడా జూన్ మూడో వారం లేదా ఆఖరి వారంలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లో ఈ సినిమాకు సుమారు రూ. 170 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దృశ్యం పార్ట్ 2 కథ ఎక్కడైతే ముగిసిందో.. దృశ్యం 3 అక్కడ నుంచే స్టార్ట్ అయింది. వరుణ్ హత్య కేసును హై కోర్టు పూర్తిగా కొట్టేయడంతో జార్జ్ అలియాస్ మోహన్ లాల్ ఫ్యామిలీ పెద్ద గండం నుంచి గట్టెక్కినట్లు ఫీల్ అవుతారు. గతాన్ని మర్చిపోయి హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. అంతేకాకుండా సినిమాల మీద పిచ్చి ఉండే జార్జ్ తన సొంత కథనే ‘దృశ్యం’ పేరుతో సినిమా తీసి హిట్టు కొడతాడు. మరోవైపు తన పెద్ద కూతురు అంజు అలియాస్ అన్సీబా హసన్‌ను పెళ్లి చేయాలని మంచి సంబంధాలు చూస్తుంటాడు. అయితే ఏదో ఒక కారణంతో అంజుకు వచ్చిన సంబంధాలన్ని ఆఖరి నిమిషంలో ఆగిపోతుంటాయి. అప్పుడే జార్జ్‌కు అనుమానం స్టార్ట్ అవుతుంది. దీని వెనుకున్న కారణం ఏంటా అని ఆరాతీయడం మొదలు పెడతాడు. అప్పుడు జార్జ్‌కు కొందరు శత్రువులు పాత పగను మనసులో పెట్టుకుని తన కూతురుకు పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నారని గ్రహిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అంజు పెళ్లికి అడ్డుగా ఉంది ఎవరు? దీని వెనుక వరుణ్ ఫ్యామిలీ హస్తం ఉందా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













