Last Updated:
దుల్కర్ సల్మాన్.. పేరుకు మలయాళ హీరోనే అయినా తెలుగులో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరో.. మలయాళం, తెలుగుతో పాటు తమిళం, హిందీ – ఇలా చాలా భాషల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
దుల్కర్ సల్మాన్.. పేరుకు మలయాళ హీరోనే అయినా తెలుగులో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరో.. మలయాళం, తెలుగుతో పాటు తమిళం, హిందీ – ఇలా చాలా భాషల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దుల్కర్ ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు కాకుండా, కొత్త కొత్త రకాల పాత్రలను ఎంచుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన నటన చాలా విభిన్నంగా, ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. మన తెలుగులో కూడా ఆయన నటించిన ‘మహానటి’, ‘సీతా రామం’, ‘లక్కీ భాస్కర్’ లాంటి సినిమాలు అరివీర భయంకర హిట్లు. ఇక ఇప్పుడు ఈ హీరో మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావాడానికి రెడీ అయిపోయాడు.
ఆ సినిమా పేరు ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాల్లో మంచి పాజిటీవ్ వైబ్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఈమె గ్లింప్స్‌కు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ సాంగ్‌ను జూలై 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సందీప్ గున్నం, రమ్య గున్నంలు కలిసి లైట్‌బాక్స్ మీడియా అనే బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అంతేకాదు, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాలు సమర్పిస్తున్నాయి. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ శూజిత్ శారంగ్ చేస్తున్నాడు. అలాగే శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాదు, తమిళం, హిందీ, మలయాళం – ఇలా మొత్తం నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఇక దుల్కర్‌కు ఇప్పుడు తెలుగు మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు రిలీజవుతున్నాయంటే మినిమం ఎంటర్టైనమెంట్ గ్యారెంటీ అని ఆడియెన్స్ ఫిక్సయిపోయారు. దానికి తోడు దుల్కర్ సైతం ఎప్పుడూ ఒకే ధోరణిలో సినిమాలు చేయకుండా.. ప్రతీ సినిమాతో ఓ కొత్త కథను చెప్పడానికి ప్రయత్నింటారు. ఇక ఇప్పుడు ఆకాశంలో ఒక తార కూడా అలానే సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా దర్శకుడు పవన్ సాధినేని గతంలో ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి వంటి సినిమాలు తీశాడు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














