Last Updated:
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తాజాగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది.
Ebola: ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ‘ఎబోలా’ (Ebola) వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తీవ్రంగా స్పందిస్తూ హై-అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి దేశాలలో అరుదైన ‘బుండిబుగ్యో’ (Bundibugyo) స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అక్కడ వందలాది మంది దీని బారిన పడగా, మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది.
ఏబోలా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తాజాగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది. జ్వరం, వాంతులు, అకారణ రక్తస్రావం, తలనొప్పి, వంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఎయిర్‌పోర్టు హెల్త్ ఆఫీసర్‌కు ఇమిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే వెల్లడించాలని స్పష్టం చేసింది. ఎబోలా కేసులు అధికంగా ఉన్న డీఆర్సీ, ఉగాండా, దక్షిణ సుడాన్‌కు వెళ్లవద్దని కేంద్రం ఇప్పటికే భారతీయులకు సూచించింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. లెబొరేటరీలు, క్వారంటైన్ వసతులను ఏర్పాటు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













