ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జూలై 19న అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే, ఈ చరిత్రాత్మక ఫైనల్ మ్యాచ్కు ఉపయోగించే మైదానంలోని గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, వాటిని అత్యంత జాగ్రత్తగా ప్రత్యేకమైన అక్రిలిక్ డిస్ప్లే కేసుల్లో భద్రపరిచి అభిమానులకు అమ్ముతున్నారు. ఫీఫా అధికారిక స్టోర్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, ఈ గడ్డి ముక్కల ధరలు 450 డాలర్ల (సుమారు రూ.37వేలు) నుంచి ప్రారంభమై అత్యధికంగా 3,000 డాలర్ల (సుమారు రూ.2.5 లక్షలు) వరకు ఉన్నాయి. ఇందులో ప్రాథమికమైన 450 డాలర్ల విలువైన “ఫౌండేషన్” ఎడిషన్ అద్భుతమైన స్పందనతో ఇప్పటికే ఫీఫా స్టోర్లో పూర్తిగా అమ్ముడుపోయింది. అయితే, యూకేకు చెందిన ప్రముఖ తయారీ సంస్థ ‘కీప్ స్టబ్’ (Keep Stub) ద్వారా 4 రకాల విభిన్న ఎడిషన్లు (450డాలర్లు, 900డాలర్లు, 1200డాలర్లు, 3000 డాలర్లు) ఇంకా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. (Image credit – x – Nepalkathaa)














