మీ ఇంట్లో వంట గ్యాస్ అయిపోయిందా.. వెంటనే రీ-ఫిల్ బండ కోసం ఆర్డర్ ఇచ్చేయండి. ఆలస్యం చెయ్యవద్దు. ఎందుకంటే.. వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే కాదు.. పెట్రోల్, డీజిల్, ఎరువులు, మందులు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు.. ఇలాంటివన్నీ భారీగా ధరలు పెరిగే పరిస్థితి దాపురిస్తోంది. అమెరికా, ఇరాన్ చేసుకుంటున్న యుద్ధం వల్ల మనం ఇరుక్కుపోతున్నాం. సంపన్న దేశమైన అమెరికా.. తన స్థాయిని మర్చిపోయి.. వీధి రౌడీలా తయారై.. రోజూ గొడవలు పెట్టుకుంటోంది. ఇప్పుడు ట్రంప్ చేసిన కొత్త ప్రకటనలైతే.. ప్రపంచ దేశాల గుండెల్లో చమురు నౌకల్ని పరుగెత్తిస్తున్నాయి.














