Last Updated:
FIFA World Cup 2026: అంతర్జాతీయ ఫుట్‌బాల్ మైదానంలో ఫ్రాన్స్ మరోసారి తన సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో క్లియన్ ఎంబాపె, ఉస్మానే డెంబెలే అద్భుత గోల్స్‌తో మొరాకోను 2-0 తేడాతో చిత్తు చేసి ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
2022 ఫిఫా ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన హై-వోల్టేజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరాకోను చిత్తు చేసి, వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. పటిష్టమైన డిఫెన్స్‌తో సవాలు విసిరిన మొరాకోను ద్వితీయార్ధంలో ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్లు క్లియర్ క్లిక్‌లతో కట్టడి చేశారు.
మ్యాచ్ ప్రారంభం నుంచే ఫ్రాన్స్ అటాకింగ్ గేమ్‌ను నమ్ముకోగా, మొరాకో తమ డిఫెన్స్‌తో ముప్పేట దాడిని అడ్డుకుంది. మ్యాచ్ 28వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ కిలియన్ ఎంబాపె (Kylian Mbappe) గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో అత్యంత చాకచక్యంగా ఎంబాపె లో-షాట్‌ను అడ్డుకుని జట్టుకు పెద్ద ఊరటనిచ్చాడు. దీంతో మొదటి భాగం ముగిసేసరికి ఇరు జట్లు 0-0తో సమంగా నిలిచాయి.
రెండో భాగంలో ఫ్రాన్స్ మరింత వేగంగా కదిలింది. మ్యాచ్ 60వ నిమిషంలో ఎంబాపె తన పెనాల్టీ మిస్కు ప్రతీకారం తీర్చుకుంటూ పెనాల్టీ బాక్స్ వెలుపల నుండి ఒక అద్భుతమైన కర్లింగ్ షాట్‌తో గోల్ కొట్టి ఫ్రాన్స్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ ఆనందం ముగియకముందే, సరిగ్గా 6 నిమిషాల వ్యవధిలో (66వ నిమిషంలో) మరో స్టార్ ప్లేయర్ ఉస్మానే డెంబెలే (Ousmane Dembele) లో-డ్రైవ్ షాట్‌తో రెండో గోల్ సాధించి ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు.
గాయం కారణంగా తమ కీలక ఫార్వర్డ్ ఆటగాడు ఇస్మాయిల్ సైబారీ దూరమవ్వడం మొరాకోను తీవ్రంగా దెబ్బతీసింది. మ్యాచ్ 84వ నిమిషం వరకు వారు ఫ్రాన్స్ గోల్ పోస్ట్‌పై కనీసం ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయారు. అజ్జెద్దీన్ ఔనాహి కొట్టిన ఫ్రీ-కిక్‌ను ఫ్రాన్స్ కీపర్ మైక్ మైగ్నాన్ సమర్థవంతంగా అడ్డుకోవడంతో మొరాకో ఆశలు అడియాశలయ్యాయి. ఈ టోర్నమెంట్లో ఎంబాపెకు ఇది 8వ గోల్ కావడం విశేషం. ఈ విజయంతో ఫ్రాన్స్ జూలై 14న జరగబోయే సెమీఫైనల్లో బెల్జియం లేదా స్పెయిన్‌తో తలపడనుంది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














