త్వరలో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సు పథకం హామీ తెరపైకి రావచ్చు. అదే జరిగితే.. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల దీనికి మరింత క్రేజ్ పెరుగుతుంది. కుటుంబమైనా, సమాజమైనా, రాష్ట్రమైనా, దేశమైనా.. మహిళలు అడుగులు ముందుకు వేస్తేనే, అసలైన అభివృద్ధి ఉంటుంది. అందుకు ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ప్రగతి చక్రంలా ఉపయోగపడుతోంది. మహిళాభ్యున్నతికి దారి చూపిస్తోంది.













