Fuel Shortage: తిరుమలలో ఫ్యూయల్ టెన్షన్.. రంగంలోకి దిగిన టీటీడీ, భక్తులకు కీలక నిర్ణయం..! fuel shortage in tirumala ttd emergency measures for devotee | | ACTPnews

తిరుమల


Last Updated:

తిరుమలలో ఇంధన కొరతపై టీటీడీ అప్రమత్తం, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి తనిఖీలు, తాత్కాలిక పరిమితులతో భక్తుల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చర్యలు

+

తిరుమల లో ద్విచక్ర వాహనాలకు 1 లీటర్, కార్లకు 5 లీటర్ల పరిమితి..!

తిరుమలలో ఇంధన కొరత పరిస్థితులు ఏర్పడడంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి స్వయంగా రంగంలోకి దిగారు. అక్కడి పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, పెట్రోల్, డీజిల్ నిల్వల పరిస్థితిని సమీక్షించారు.

పెట్రోల్ బంకుల నిర్వాహకులతో నేరుగా మాట్లాడిన ఆయన, సరఫరాలో అంతరాయం కలిగిన కారణాలను తెలుసుకున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలని స్పష్టంగా ఆదేశించారు. తిరుమలకు వచ్చే వేలాది మంది యాత్రికుల ప్రయాణం ఇంధన సమస్య వల్ల ఆగిపోకుండా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

ప్రస్తుతం తిరుమలలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో సుమారు 1000 లీటర్ల పెట్రోల్, 3000 లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో మరిన్ని ట్యాంకర్లు సాయంత్రానికి చేరుకోనున్నాయని, దీంతో కొరత పరిస్థితి త్వరలోనే తగ్గే అవకాశముందని చెప్పారు.

ఇంధన సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ, పెట్రోల్ బంకు యాజమాన్యం కలిసి చర్యలు చేపట్టింది. నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.

ఇక అందరికీ కనీస అవసరమైన ఇంధనం అందేలా తాత్కాలిక పరిమితులు అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి 1 లీటర్, కార్లు, జీపులు, టెంపో ట్రావెలర్లకు గరిష్టంగా 5 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం ఇస్తున్నారు. ఈ నిర్ణయం తాత్కాలికమే అయినప్పటికీ, అందరికీ సమానంగా ఇంధనం అందించడమే లక్ష్యంగా తీసుకున్న చర్య అని స్పష్టం చేశారు.

ఈ పరిస్థితులపై భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ భరోసా ఇస్తోంది. త్వరలోనే సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులోకి వస్తాయని, పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. మొత్తానికి, తిరుమలలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ వేగంగా చర్యలు చేపడుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports