Gangamma Jathara 2026: గంగమ్మ జాతరకు సిద్దమైన టెంపుల్ సిటీ.. రేపటి నుండి రోజూ పండగే | | ACTPnews

Gangamma Jathara 2026


Last Updated:

Gangamma Jathara 2026: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జరుపుకునే జాతరల్లో ఒకటైన తిరుపతి గంగమ్మ జాతర 2026 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 5 నుండి మే 13 వరకు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించబడనుంది.

Gangamma Jathara 2026
Gangamma Jathara 2026

Gangamma Jathara 2026: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జరుపుకునే జాతరల్లో ఒకటైన తిరుపతి గంగమ్మ జాతర 2026 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 5 నుండి మే 13 వరకు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించబడనుంది. గ్రామీణ సంప్రదాయాలు, భక్తి భావం, ప్రజల ఉత్సాహం కలిసిన ఈ జాతర గంగమ్మ తల్లికి అంకితం చేయబడింది.

రాయలసీమ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ది గాంచిన ఈ గంగమ్మ జాతరకు జిల్లా నలుమూల నుండే కాదు తమిళనాడు, కర్నాటక నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ ఉత్సవాలు ప్రతి రోజూ ప్రత్యేకమైన వేషధారణలతో కొనసాగడం ఈ జాతర ప్రత్యేకత. మే 5న ‘చాటింపు’తో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు, మే 6న బైరాగి వేషం, మే 7న బండ వేషం,మే 8న తోట వేషం, మే 9న ధోర వేషం, మే 10న మాతంగి వేషం, మే 11న సున్నపు కుండలు వంటి సంప్రదాయ కార్యక్రమాలతో భక్తులను అలరిస్తాయి.

ఈ జాతరలో ప్రతి రోజు జరిగే వేషాలు సామాజిక సందేశాలను, స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. గ్రామ దేవతగా గంగమ్మను భావించే ప్రజలు, ఆమెకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తూ తమ కోరికలను తెలియజేస్తారు. మే 12న ప్రధాన గంగమ్మ జాతర రోజుగా అత్యంత వైభవంగా జరుగుతుంది, ఈ రోజున వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మే 13న ‘విశ్వరూప దర్శనం’తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ జాతర తిరుపతి ప్రాంతీయ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండి, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడంతో పాటు పర్యాటకులను కూడా ఆకర్షించే విశిష్ట ఉత్సవంగా నిలుస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports