Gangamma Temple Mystery: ఈ గ్రామ దేవత గుడి జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి లాంటిదే.. స్పెషాలిటీ తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్తారు | | ACTPnews

Gangamma


Last Updated:

Gangamma Temple Mystery: రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. గ్రామదేవత పేరుతో వెలిసిన ఈ ఆలయంలో భక్తులు మొక్కుల పేరుతో జంతువులను బలిస్తారు. తీర్థ, ప్రసాదాలు, పూజా విధానం, ఆలయ చరిత్ర తెలిస్తే తప్పకుండా వెళ్లి వస్తారు.

+

Gangamma Temple Mystery

Gangamma Temple: అది జిల్లాలోనే అతి పెద్ద గ్రామ దేవతగా పేరొందిన ఆలయం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో ఉంది. ఈ ఆలయానికి 450 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ టెంపుల్‌కి మంగళ, శుక్రవారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకొంటారు. ఇక్కడ జంతు బలులు నిర్వహించడం ఆనవాయితీగా నేటికి కొనసాగుతోంది. చీకటి పడితే కొండ మీద ఒక్క మనిషి కూడా బస చెయ్యరు. ఎందుకంటే రోజంతా అమ్మవారి ఆలయ ప్రాంగణం వెనుక బాగానే గొర్రెలు, మేకలు,కోళ్లు వంటి వాటికి జంతు బలి నిర్వహిస్తారు. భక్తులు కూడా కోరే కోర్కెలు వేటతోనే ముడి పడి ఉండటం ఇక్కడ విశేషం. రోజంతా బలిగొన్న జంతు ప్రాణాలు మనిషి ఆత్మలు వలే అక్కడే తిరుగుతుంటాయి. కాబట్టి కొండ మీద నిద్రపోతే జాగారమే. పీడకలలు నిద్రను దూరం చేస్తాయి. అమ్మవారు శాంతించే సమయం చీకటి పడినప్పుడేనని ఎవ్వరు ఆ నాటి నుండి నేటి వరకు కొండపైన బస చేయడానికి సాహసించరనే నమ్మకం ఉంది.

గ్రామ దేవతలు లేని ఊరు ఉండదు..

ఏ గ్రామానికి వెళ్లిన కచ్చితంగా అమ్మవారి ఆలయం వుంటుంది. అదే విధంగా పొలిమేరల్లో కూడా ఉంటుంది. వీటికి భిన్నంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామ సరిహద్దున కొండపై అతి పెద్ద అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి కేవలం చిత్తూరు జిల్లా ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇది కర్ణాటక సరిహద్ద ఆలయం కావడంతో నిత్యం కన్నడ భక్తులు ఆలయానికి వస్తారు. ఈ టెంపుల్‌కి ఉన్న మరో విశేషం ఏమిటంటే అమ్మవారి శిరస్సు మీద బంతి పూలు పెట్టి మనం మనసులో కోర్కెలు కోరుకుంటే అవి నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి తలపై పెట్టే పువ్వులు కూడా అందుకు తగినట్లుగా సంకేతం ఇస్తాయని అంటారు. ఎలాగంటే అమ్మవారి తల మీద బంతి పువ్వులు తప్పా మరొక పువ్వు వాడారు. మనం బంతి పువ్వును అలంకార ప్రాయం కోసమే మాత్రమే వాడుతాం కానీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆ పువ్వులను చాలా పవిత్రంగా పూజిస్తారు. కోర్కెలు తెలుసుకోవడం కోసమే భక్తులు ఆ ఆలయం బాట పడుతుంటారు.

పూజా విధానం ఇలా..

ఆలయంలో పూజా విధానం అన్ని ఆలయాలలో వున్నట్లే వుంటుంది. కాని భక్తులు ఎక్కువగా జంతు బలి పేరుతో తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ చుట్టు ప్రక్కలా చిన్న చిన్న కొండలు, గుట్టలమయం, అంతా చిట్టడవిలా కనిపిస్తుంది. సామాన్యంగా భక్తులు అందరూ విడి విడిగా కాకుండా గుంపులుగా, ఫ్యామిలీలతో బృందాలుగా వస్తారు. తమ వెంట వంట సామాన్లతో పాటు బలి ఇచ్చేందుకు మేక, గొర్రె, కోడి వంటి జంతువులను తీసుకొని వస్తారు. ఎలాంటి వంట సామాగ్రి తీసుకురాని వారికి ఇక్కడ అద్దెకు లభిస్తాయి. గంగమ్మ కొండ దిగువన మేకలను, గొర్రెలను కోసి వంటలు చేసి అక్కడే తిని గంగమ్మను దర్శించుకొని సాయంకాలం తీరిగ్గా ఇళ్లకు వెళ్తారు. గంగమ్మకు మొక్కిన వారు వాయిదా వేయ కుండా తప్పని సరిగా మొక్కును తీర్చు కుంటారు. లేకుంటే గంగమ్మ ఆగ్రహారానికి గురి కావలసి వస్తుందని భయపడతారు.

పెద్దమ్మగుడి లాంటిదే..

ఇక్కడి మరో ప్రత్యేకత ఏమంటే ఆలయం లోపల మామూలుగా ప్రసాదాలు ఇస్తుంటారు. ఎక్కడ లేని విధంగా ఇక్కడ రంగు నీళ్లను కూడా తీర్తం లాగ ఇస్తారు. దాని కొరకు అందరు నీళ్ల బాటిళ్లు తీసుకెళతారు. ఆ నీళ్లను తమ పంట పొలాలలో చల్లితే పంటలకు చీడ పీడలు తగలకుండా మంచి పంట నిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి భక్తులు మన రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న కర్నాటక , తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. చౌడేపల్లి సమీపాన వున్న కొండపై వెలసిన దేవత ఆలయం హైదరాబాద్ జూబ్లిహిల్స్ పెద్దమ్మగుడి తరహాలోనే అనేక మొక్కులు, పూజలు, జాతర కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఈ ఆలయం పురాతనమైనదే అయినప్పటికి ఈ మధ్యనే ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports