Last Updated:
తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 9 మంది నిందితులను అరెస్ట్ చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సరఫరా మార్గాలను మార్చుకుని గంజాయిని తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.. తాజాగా రెండు వేర్వేరు కేసుల్లో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నాలుగు సెల్ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. గంజాయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అదనపు ఎస్పీలు రవి మనోహర చారి, ఆర్ల శ్రీనివాసులు హెచ్చరించారు.














