Last Updated: Aug 02, 2026, 14:51 IST
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించిన ఆయన, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్‌ను దొంగిలించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థల సేకరణ, వివాదాల పరిష్కారంతో సహా ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసలు కష్టం వైఎస్ జగన్‌దేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పారని మండిపడిన ఆయన, అసలు ఈ ప్రాజెక్టు నిర్మించిన జీఎంఆర్ (GMR) సంస్థతో ఎందుకు మాట్లాడించలేదని ప్రశ్నించారు.













