Yellamma Movie: ‘ఎల్లమ్మ’ మూవీ ఫస్ట్ లుక్.. దేవి శ్రీ ప్రసాద్ మాములుగా లేడుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఇప్పుడంటే అనిరుధ్, సాయి అభ్యంకర్ పాటలకు పట్టం కడుతున్నారు కానీ.. అసలు దేవి శ్రీ ప్రసాద్ బీట్‌‌ను ఎవరు మ్యాచ్ చేయలేరనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి జనరేషన్‌కు దేవీ పాటల గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. 90స్ కిడ్స్‌కు మాత్రం దేవి శ్రీ ప్రసాద్ గురించి.. ఆయన పాటల గురించి చెప్పమంటే కథలు కథలుగా చెప్తారు.

News18
News18

ఇప్పుడంటే అనిరుధ్, సాయి అభ్యంకర్ పాటలకు పట్టం కడుతున్నారు కానీ.. అసలు దేవి శ్రీ ప్రసాద్ బీట్‌‌ను ఎవరు మ్యాచ్ చేయలేరనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి జనరేషన్‌కు దేవీ పాటల గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. 90స్ కిడ్స్‌కు మాత్రం దేవి శ్రీ ప్రసాద్ గురించి.. ఆయన పాటల గురించి చెప్పమంటే కథలు కథలుగా చెప్తారు. ఇప్పటి వరకు ఆయన కంపోజ్ చేసిన ఏ ఒక్క ఆల్బమ్ కూడా డిజప్పాయింట్ చేయలేదంటే.. ఆయన రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అన్ని భాషల్లో కలిపి దాదాపు 100కు పైగా సినిమాలకు సంగీతం అందించాడు దేవి. కాగా.. ఇప్పుడు హీరోగా ఎంట్రీకి సిద్దమయ్యాడు. బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో మాములు ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేయలేదు. బలగంతో డెబ్యూ సినిమాతోనే యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను తనవైపు చూసేలా చేసుకున్న వేణు.. ఇప్పుడు ఎల్లమ్మతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడా అని అందరూ వేయిట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నేడు దేవి శ్రీ ప్రసాద్ పుట్టిన రోజు కావడంతో.. బర్త్‌డే విషెస్ చెప్తూ మేకర్స్ దేవీ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో దేవీ ఓ చేతిలో కిరీటం పట్టుకుని.. పీరియాడిక్ లుక్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ మూవీలో దేవీ శ్రీ ప్రసాద్ పర్శి క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు.

నిజానికి.. బలగం తర్వాత వెంటనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావాల్సింది. కానీ.. పలు కారణాల వల్ల డిస్కషన్‌లోనే రెండేళ్లు ఆగిపోయింది. ముందుగా నితిన్‌ను ఈ సినిమాలో హీరోగా అనుకున్నారు. అన్ని రెడీ అయి రేపో, మాపో పట్టాలెక్కుతుంది అని ఈ ప్రాజెక్ట్ నుంచి నితిన్ తప్పుకున్నాడు. అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్‌కు.. ఈ స్టోరీ ఇప్పుడు తనకు సెట్ కాదని తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత నానితో కూడా మేకర్స్ సంప్రదింపులు జరిపారు. కానీ నాని కూడా పలు కారణాల వల్ల రిజెక్ట్ చేశాడట. చివరగా.. దేవీని లైన్‌లోకి తీసుకొచ్చారు. దిల్ రాజు సైతం.. దేవికి ఎప్పుడో నిన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పాడట. అలా మొత్తానికి ఓ క్రేజీ సబ్జెక్ట్‌తో దేవీ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *