Last Updated:
పది రోజుల కిందట రిలీజైన ‘జన నాయకుడు’ సినిమా యూనానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట కాస్త హడావిడి కనిపిస్తుంది కానీ.. తెలుగులో మాత్రం సినిమాకు దారుణమైన టాక్ తెచ్చుకుంది. మాములుగానే ఒక సినిమా రీమేక్ అవుతుందంటే.. ఒరిజినల్ వెర్షన్‌తో ఖచ్చితంగా కంపేర్ చేస్తుంటారు.
పది రోజుల కిందట రిలీజైన ‘జన నాయకుడు’ సినిమా యూనానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట కాస్త హడావిడి కనిపిస్తుంది కానీ.. తెలుగులో మాత్రం సినిమాకు దారుణమైన టాక్ తెచ్చుకుంది. మాములుగానే ఒక సినిమా రీమేక్ అవుతుందంటే.. ఒరిజినల్ వెర్షన్‌తో ఖచ్చితంగా కంపేర్ చేస్తుంటారు. హీరో పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ల పర్ఫార్మెన్స్, డైరెక్టర్ మార్క్ ఇలా ప్రతీదాంట్లో పొలికలు చూస్తుంటారు. అలానే జన నాయకుడు, భగవంత్ కేసరి సినిమాను పోలిస్తే ఎక్కడా పొంతా లేదు. భగవంత్ కేసరిని మక్కికి మక్కి దించినా రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో.. కానీ సెకండాఫ్‌లో సినిమా మొత్తం డీవీయేట్ చేసి.. అసలు సంబంధం లేని స్క్రీన్‌ప్లేతో హెచ్. వినోద్ గందరగోళం చేశాడు. అయితే టాక్ ఎలా ఉన్నా కానీ.. తమిళనాడు సహా ఓవర్సీస్‌లో మాత్రం సినిమా దుమ్మరేపింది.
ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.280 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు డిజాస్టర్ టాక్‌తో ఈ రేంజ్ కలెక్షన్లు రావడం అంటే మాములు విషయం కాదు. ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ.200 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు రూ.129 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక విజయ్ కెరీర్‌లో వరుసగా 9వసారి రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిన సినిమాగా కూడా ‘జన నాయకుడు’ నిలిచింది.
ఇప్పటికే విజయ్ నటించిన ‘మెర్సల్’, ‘సర్కార్’, ‘బిగిల్’, ‘మాస్టర్’, ‘బీస్ట్’, ‘వారిసు’, ‘లియో’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)’ సినిమాలు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ‘జన నాయకుడు’ కూడా అదే జాబితాలో చేరడంతో విజయ్ వరుసగా తొమ్మిది సినిమాలతో ఈ మైలురాయిని అందుకున్న హీరోగా నిలిచారు.
సాధారణంగా స్టార్ హీరోల కెరీర్‌లో కొన్ని సినిమాలు భారీ విజయాలు సాధిస్తే, మరికొన్ని సినిమా ఆశించిన స్థాయిలో రాణించవు. కానీ విజయ్ మాత్రం వరుస సినిమాలతో నిరంతరంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్‌ను అందుకుంటూ తన బాక్సాఫీస్ స్థిరత్వాన్ని చాటుకున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఈ స్థాయిలో వరుస విజయాలను నమోదు చేయడం చాలా అరుదైన ఘనతగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఈ రికార్డు క్రియేట్ చేసిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా విజయ్ నిలిచాడు. ఆ తర్వాత రజనీకాంత్ 8 సినిమాలతో సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. ప్రభాస్ 7 సినిమాలతో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన విజ్జి అలియాస్ మమితా బైజును దళపతి వెట్రి కొండన్ అలియాస్ విజయ్ దళపతి ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆమెను ఆర్మీ అధికారిగా చూడాలని కలలు కంటాడు. కానీ విజ్జి భయాలతో పాటు మానసిక సమస్యల కారణంగా ఆ దిశగా వెళ్లడానికి ఆసక్తి చూపదు. ఇదే సమయంలో జాన్ హిమ్లర్ అలియాస్ బాబీ డియోల్ అనే ప్రమాదకర వ్యక్తి, రాజకీయ నాయకుడు రోజా రంగసామి అలియాస్ ప్రకాష్ రాజ్‌తో కలిసి దేశంలో మత ఘర్షణలు రేపి అల్లకల్లోలం సృష్టించే కుట్ర పన్నుతాడు. ఈ కుట్రను దళపతి ఎలా అడ్డుకున్నాడు? విజ్జిలోని భయాన్ని ఎలా పోగొట్టాడు? అన్నదే సినిమా ప్రధాన కథ.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














