Last Updated:
టాలీవుడ్లో రవితేజ నటించిన ‘ఇరుముడి’, బాలీవుడ్లో విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ‘హనుమాన్ అంశ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మహా వృక్షాల్లా ఎదగడమే కాకుండా, థియేటర్ల వద్ద ఊహించని సంఘటనలకు దారి తీశాయి.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. కమర్షియల్, యాక్షన్, రొమాంటిక్ చిత్రాలకు మించి డివోషనల్, ఎమోషనల్ కథాంశాలతో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. సినిమా కంటెంట్ బలంగా ఉండి, దానికి దైవ భక్తి, ఎమోషన్ తోడైతే ప్రేక్షకులు ఆ సినిమాలను ఎంతలా ఓన్ చేసుకుంటారో చెప్పడానికి ఇటీవల వచ్చిన రెండు చిత్రాలే ప్రత్యక్ష ఉదాహరణలు. టాలీవుడ్లో రవితేజ నటించిన ‘ఇరుముడి’, బాలీవుడ్లో విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ‘హనుమాన్ అంశ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మహా వృక్షాల్లా ఎదగడమే కాకుండా, థియేటర్ల వద్ద ఊహించని సంఘటనలకు దారి తీశాయి.














