Last Updated:
Hyderabad’s Life Sciences: గ్లోబల్ బయోఫార్మాస్యూటికల్ అగ్రగామి సంస్థ ఎంఎస్‌డీ (MSD – మెర్క్ & కో) హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన 2.5 లక్షల చదరపు అడుగుల భారీ అత్యాధునిక టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం ఈ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌డీ డిజిటల్ హ్యూమన్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ నారాయణ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేష్ శ్రీవాస్తవ, తెలంగాణ ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














