Harish Rao Fire On CM Revanth Reddy : రేవంత్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

Harish Rao Fire On CM Revanth Reddy : రేవంత్పై హరీష్ రావు ఫైర్!



తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే వరంగల్ రైతు డిక్లరేషన్ను రేవంత్ రెడ్డి బొందపెట్టారని మండిపడ్డారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు బోనస్ ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనబోదని రేవంత్ రెడ్డి మాట మార్చారని విమర్శించారు. గతంలో ఎన్ని వడ్లయినా కొంటామని చెప్పి, ఇప్పుడు కేంద్రం ఎంత చెప్తే అంతే కొంటామని తోక ముడిచారని హరీష్ రావు ఎండగట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *