జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపుల బాధితురాలు హర్షవీణ బుధవారం విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “ఒక దరిద్రుడు నడిరోడ్డు మీద నన్ను కొట్టాడు. ఈసారి కొట్టడానికి వస్తే నోటితో కాదు, నా చేత్తోనే పని చెప్తా” అని ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, పార్టీ ఎటువంటి క్లీన్ చీట్ ఇవ్వకుండానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఈస్ట్ గోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి విజయవాడ నోవోటల్ వరకు ఆయన చేసిన లీలలన్నీ తనకు తెలుసని పేర్కొన్నారు. అంతేకాకుండా, అరవ శ్రీధర్ వంటి నాయకుల ప్రవర్తన వల్లే పవన్ కల్యాణ్ అనారోగ్యం పాలవుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మాటను, పార్టీ గౌరవాన్ని అరవ శ్రీధర్ మంటగలుపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Source link
Harshaveena’s Explosive Allegations | ఈసారి నేనూ కొడతా.. మీ వల్లే పవన్‌కు అనారోగ్యం..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










