ఏపీ ప్రజలకు, దేశానికి ప్రయోజనాలు: ఈ హీలియం ఉత్పత్తి కారణంగా.. వేలా కొద్దీ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల సృష్టి జరగగలదు. ఇంజనీర్లు, టెక్నీషియన్ల జాబ్స్ వస్తాయి. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే.. హీలియం ఉత్పత్తి కారణంగా.. ఎరువుల ఫ్యాక్టరీలు, రిఫైనరీల ఏర్పాటు సాధ్యమవుతుంది. మెరుగైన రోడ్లు వస్తాయి. పవర్ సెక్టార్, రేవుల అభివృద్ధి సాధ్యమవుతుంది. అంటే.. హీలియం ఉత్పత్తి అనేది.. జస్ట్ ఒక ప్లాంట్‌లో ఉత్పత్తి మాత్రమే కాదు. అది స్థానికంగా అనేక రంగాలను అభివృద్ధి చెయ్యడానికి వీలుకల్పించగలదు. మౌలిక వసతులు డెవలప్ అవుతాయి.













