Last Updated:
Hyderabad: హైదరాబాద్‌లోని బొల్లారం మిలిటరీ కేంద్రంలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ ప్రాంగణంలోనే ఆయుధాలు మాయం కావడం భారత రక్షణ శాఖలో పెను ప్రకంపనలు సృష్టించింది. గత పది రోజులుగా ఈ వ్యవహారంపై ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు నిరంతరాయంగా విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థలు అనుమానితుల జాబితాను సిద్ధం చేసి, కీలక ఆర్మీ అధికారిని లోతుగా విచారిస్తుండటంతో కేసు కీలక మలుపు తిరిగింది. మరో రెండు రోజుల్లో ఈ నిగూఢమైన మిస్టరీ వీడే అవకాశం ఉందని విచారణ వర్గాలు వెల్లడిస్తున్నాయి.














