IND W vs BAN W: నేడే అసలైన సమరం! బద్ధ శత్రువుతో టీమిండియా ఫైట్.. గెలిస్తే నేరుగా ఫైనల్స్‌కే! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

IND W vs BAN W: మహిళల ఆసియా కప్‌లో అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. లీగ్ దశలో అద్భుత విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు గురువారం దుబాయ్ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది.

టీమిండియా
టీమిండియా

గ్రూప్ దశలోని మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యంతో సెమీస్ చేరిన హర్మన్‌ప్రీత్ సేన, ఈ నాకౌట్ పోరులో స్పష్టమైన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు కాస్త తడబడుతూనే నాకౌట్ బెర్తును దక్కించుకున్న బంగ్లాదేశ్, పటిష్టమైన భారత్‌కు ఏ మేరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గణాంకాల పరంగా చూస్తే బంగ్లాదేశ్‌పై భారత్‌కు ఎదురులేని రికార్డు ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 24 అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఏకంగా 21 మ్యాచుల్లో విజయం సాధించగా, బంగ్లా కేవలం 3 సార్లే గెలిచింది. అయితే, నాకౌట్ ఒత్తిడితో పాటు దుబాయ్ పిచ్ పరిస్థితులు బంగ్లా బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆడాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports