Last Updated:
Hyderabad: ఆర్టీసీ బస్సులు కూడా సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రజా రవాణా సంస్థలో పని చేసే సిబ్బంది నిర్లక్ష్యం రోడ్డుపై బైకుపై వెళ్తున్న ఓ యువతి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో శనివారం చోటుచేసుకున్న ఈదుర్ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Hyderabad: ఆర్టీసీ బస్సులు కూడా సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రజా రవాణా సంస్థలో పని చేసే సిబ్బంది నిర్లక్ష్యం రోడ్డుపై బైకుపై వెళ్తున్న ఓ యువతి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో శనివారం చోటుచేసుకున్న ఈదుర్ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మృతురాలు హేమదుర్గగా గుర్తించారు. హైదరాబాద్‌లోనే ఒక కార్ షోరూమ్‌లో కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నట్లుగా గుర్తించారు. మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.














