Last Updated:
జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌ను పాకిస్థాన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. అతడి ఆచూకీ తెలిపిన వారికిచ్చే నజరానాను 70 లక్షల పాకిస్థానీ రూపాయలకు పెంచుతూ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
భారత్‌లో ఎన్నో రక్తపాత దాడులకు కుట్ర పన్నిన అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్‌పై పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ దర్యాప్తు సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ‘రెడ్ బుక్’ తాజా ఎడిషన్‌లో అజహర్ పేరును అధికారికంగా చేర్చినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. అంతేకాకుండా అతడి ఆచూకీ తెలిపిన వారికి లేదా అరెస్టుకు సహకరించిన వారికిచ్చే నజరానా మొత్తాన్ని మరో 20 లక్షల పాకిస్థానీ రూపాయలు పెంచింది. దీంతో అజహర్ తలపై ఉన్న మొత్తం రివార్డు విలువ 70 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది.














