Last Updated:
Hyderabad: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ పసికందు పాలిట యముడిగా మారాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి బిడ్డ అని కూడా చూడకుండా నాలుగేళ్ల పసివాడిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించి ప్రాణాలు తీశాడు.
కదిలే వాహనం కిందకు నెట్టేసి, అంతటితో ఆగక రోడ్డుకేసి పదేపదే కొట్టి దారుణానికి ఒడిగట్టాడు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆ చిన్నారి ఆదివారం ఊపిరి వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.














