Hyderabad: ఆటో, క్యాబ్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు అర్ధరాత్రి నుంచి రవాణా సేవలు బంద్! | తెలంగాణ వార్తలు | ACTPnews

ఫైల్ ఫోటో


Last Updated:

Hyderabad: రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, లారీ, బస్సు తదితర రవాణా రంగ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ‘డ్రైవర్ల సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ (JAC) డిమాండ్ చేసింది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు హెచ్చరించింది. ఈనాడు కథనం ప్రకారం.. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో బీఆర్‌టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వి.మారయ్య అధ్యక్షతన డ్రైవర్ల సమస్యలపై బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బిఆర్ఎస్ (BRS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, జేఏసీ అధ్యక్షుడు బి.వెంకటేశంలతో పాటు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports