Last Updated:
Hyderabad: పేగుబంధాన్ని మించిన ప్రేమ మరెక్కడా ఉండదని చెబుతారు. కాని ఇప్పుడు తల్లి ప్రేమ కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ లగ్జరీ అవసరాలు, చిన్న చిన్న కోరికల కోసం కన్నబిడ్డలను అమ్ముకునే దౌర్భాగ్యస్థితి దాపురించింది.
Hyderabad: మనుషుల్లో రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. మానవత్వం ఇసుమంతైనా కనిపించడం లేదు. అన్నీ బంధాల కంటే కన్నప్రేమ వెలకట్టలేనిది అంటారు. పేగుబంధాన్ని మించిన ప్రేమ మరెక్కడా ఉండదని చెబుతారు. కాని ఇప్పుడు తల్లి ప్రేమ కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ లగ్జరీ అవసరాలు, చిన్న చిన్న కోరికల కోసం కన్నబిడ్డలను అమ్ముకునే దౌర్భాగ్యస్థితి దాపురించింది. మహరాష్ట్ర ఛత్రపతి సంభాజినగర్కు చెందిన దంపతులు తమ నెల వయసున్న బిడ్డను సేవలం స్మార్ట్ ఫోన్ కోసం రూ. లక్ష 20 వేలకు విక్రయించారు. ఈ పాపంలో ఒకరిద్దరు కాదు నలుగురు వ్యక్తులు భాగస్వాములు అయ్యారు. చేతులు మారుతూ చివరకు ఆ పసిబిడ్డ హైదరాబాద్‌కు చేరుకోవడంతో పోలీసులు ఈ కేసును చేధించి నిందితుల్ని పట్టుకున్నారు.
అవసరాలు మనిషిని ఎంతకైనా తెగించేలా మార్చేస్తున్నాయి. ఓ తల్లి తనకు స్మార్ట్ ఫోన్, గోల్డ్ చైన్ కొనుక్కోవాలనుకుంది. అందుకోసం డబ్బులు లేకపోవడంతో తాను నవమాసాలు మోసి కన్న నెల రోజుల వయసున్న పసికందును అంగడి వస్తువుగా మార్చేసింది. మాతృత్వానికే కళంకం తెచ్చే ఈఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో చోటుచేసుకుంది. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న దంపతులు తమ నెల రోజుల బిడ్డను రూ.1.20 లక్షలకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు.
విచిత్రం ఏమిటంటే ఒకరి నుంచి లక్ష 20 వేలకు అమ్ముడైన ఆ పసికందు నాలుగు చేతులు మారింది. చివరకు రూ.3.50 లక్షలకు హైదరాబాద్‌కు చెందిన ఉమా ఖట్కమ్ కొనుక్కుంది. అయితే చైల్డ్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని వెదికే పనిలో పడ్డారు. అయితే పసిబిడ్డ సంభాజీనగర్ నుంచి 550 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు చేరడంతో పోలీసులు కేసును ఇక్కడ చేధించారు.
కన్నతల్లి అమ్ముకున్న పసికందును కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో తల్లిదండ్రులతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బుతో రెండు మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సమాజంలో అవసరాల కోసం బిడ్డలను తల్లిదండ్రులు అమ్ముకోవాలని చూస్తే నేరం మాత్రమే కాదు.. అలాంటి వారికి సహకరించి పసిపిల్లల్ని కొనుగోలు చేసినా నేరమేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.














