ICC Test Rankings 2026: టెస్టుల్లో భారత్‌కు గుడ్ న్యూస్.. టాప్-3లో టీమ్ ఇండియా | క్రీడా వార్తలు | ACTPnews

టీమిండియా


Last Updated:

ICC Test Rankings 2026: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న టీమ్ ఇండియా, గత ఏడాది కాలంగా టెస్టు ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశీ గడ్డపై ఎదురైన అనూహ్య ఓటములు జట్టును డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టికలో కిందకు నెట్టాయి

టీమిండియా
టీమిండియా

ICC Test Rankings 2026: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న టీమ్ ఇండియా, గత ఏడాది కాలంగా టెస్టు ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశీ గడ్డపై ఎదురైన అనూహ్య ఓటములు జట్టును డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టికలో కిందకు నెట్టాయి. అయితే, తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్ భారత్‌కు కాస్త ఊరటనిచ్చాయి. ఐసీసీ తాజా గణాంకాల ప్రకారం టీమ్ ఇండియా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకుంది.

అగ్రస్థానంలో ఆస్ట్రేలియా.. భారత్‌కు మూడో ప్లేస్

ప్రస్తుత వార్షిక ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 131 పాయింట్లతో అజేయంగా నిలిచి తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, భారత్ 104 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. గతంలో కంటే మెరుగైన ప్రదర్శనతో భారత్ ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం.

ఐసీసీ టాప్-5 టెస్టు జట్లు:

ఆస్ట్రేలియా – 131 పాయింట్లు

దక్షిణాఫ్రికా – 119 పాయింట్లు

భారత్ – 104 పాయింట్లు

ఇంగ్లాండ్ – 102 పాయింట్లు

న్యూజిలాండ్ – 101 పాయింట్లు

వెనకబడిన ఇంగ్లాండ్.. అఫ్గాన్ ఖాతా ఖాళీ

‘బజ్‌బాల్’ క్రికెట్ పేరుతో దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తున్న ఇంగ్లాండ్ (102 పాయింట్లు) ఈసారి నాలుగో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఉపఖండపు జట్లయిన పాకిస్థాన్ (89), శ్రీలంక (86) వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 12 జట్ల జాబితాలో అఫ్గానిస్థాన్ ఒక్క పాయింట్ కూడా సాధించలేక చివరి స్థానంలో నిలవడం గమనార్హం.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే కఠిన సవాల్

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) నాలుగో సీజన్‌లో భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి: War News: ఇజ్రాయెల్‌కు 6500 టన్నుల ఆయుధాలు.. ఇరాన్‌పై ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్..

భారత్ ఈ ఏడాది ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. కేవలం విజయాలే కాకుండా, పట్టికలో పైన ఉన్న జట్ల ఓటములపై కూడా భారత్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఐసీసీ ర్యాంకుల్లో మెరుగుపడడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed