ICC Womens Champions Trophy: తొలి ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. 2027లో టీ20 ఫార్మాట్‌లో మెగా టోర్నీ! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. 2027లో తొలిసారిగా జరగనున్న ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంకలో జరగాల్సిన ఈ మెగా టోర్నీని ఐసీసీ అధికారికంగా ఇండియాకు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

News18
News18

ఐసీసీ మహిళల క్రికెట్‌లో మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి తెరలేచింది. తొలిసారిగా 2027లో ప్రతిపాదించిన ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. వాస్తవానికి ఈ మెగా టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డులో నెలకొన్న పరిస్థితులు, ఐసీసీ సూచించిన సంస్కరణల అమలులో జాప్యం కారణంగా ఈ టోర్నీని అక్కడి నుంచి భారత్‌కు తరలించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యామ్నాయ వేదిక కోసం భారత్‌తో పాటు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలను పరిశీలించిన ఐసీసీ బోర్డు.. సెప్టెంబర్ 1న జరిగిన సమావేశంలో ఇండియాకే ఓటు వేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports