Last Updated:
IND vs PAK Final: పాకిస్తాన్‌పై భారత జట్టు మరోసారి చెలరేగి ఆడింది. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించకపోయినా భారత బ్యాటర్లు మాత్రం దంచి కొట్టారు. 150 కొడితే గ్రేట్ అనుకున్న చోట భారత జట్టు ఏకంగా 200కు పైగా పరుగులు సాధించింది.
మొదట అభిషేక్ శర్మ రెచ్చిపోతే.. చివర్లో తిలక్ వర్మ అదిరిపోయే ఫినిష్ ఇచ్చాడు. దెబ్బకు పాకిస్తాన్ బౌలర్లు వణికిపోయారు. ఆసియా గేమ్స్ 2026లో భాగంగా పురుషుల క్రికెట్లో జరిగిన ఫైనల్లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఉతికారేశాడు. చివర్లో తిలక్ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అదిరిపోయే ఫినిష్ ఇచ్చాడు. దాంతో భారీ స్కోరు సాధించింది.














