Last Updated:
IND vs SL 1st Test: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 2 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఇక రెండో రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది.
తొలి సెషన్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో 9 వికెట్లకు 460 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి రోజు ఆటలో రిటైర్డ్ హర్ట్ అయిన కేెఎల్ రాహుల్ రెండో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. మరో 5 పరుగులు మాత్రమే జోడించి 82 పరుగుల వద్ద అవుటైయ్యాడు. ధ్రువ్ జురెల్ (51) రాణించాడు. ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు సాధించాడు. కేశర నువాన్థా 3 వికెట్లు తీశాడు.














