Last Updated:
మ్యాచ్ మధ్యలో పాకిస్తాన్ బౌలర్.. భారత బ్యాటర్ మీదకు దూసుకెళ్లడం.. అదే సమయంలో భారత ప్లేయర్ పాక్ ప్లేయర్ గొంతు పట్టుకోవడం చకచకా జరిగిపోతాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అయిన ఎక్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.
IND W vs PAK W: హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 171 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. వరుస వికెట్లు కోల్పోతూ కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని నమోదు చేసి టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. అయితే ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో అంటూ ఒకటి వైరల్ అవుతుంది. మ్యాచ్ మధ్యలో పాకిస్తాన్ బౌలర్.. భారత బ్యాటర్ మీదకు దూసుకెళ్లడం.. అదే సమయంలో భారత ప్లేయర్ పాక్ ప్లేయర్ గొంతు పట్టుకోవడం చకచకా జరిగిపోతాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అయిన ఎక్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.
అయితే ఇది నిజమైన వీడియో కాదు. ఏఐతో సృష్టించిన వీడియో. భారత్, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య జరిగిన పోరులో ఇటువంటి సంఘటన అస్సలు చోటుచేసుకోలేదు. ఈ వీడియోను క్షణ్ణంగా పరిశీలిస్తే మీకు కూడా అర్థం అవుతుంది. మొదట మైదానంలో ఇద్దరు భారత బ్యాటర్లే కనిపిస్తారు. అనంతరం ముగ్గురు బ్యాటర్లు కనిపిస్తారు. ప్రస్తుతం బై రన్నర్ నిబంధన లేదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్యాటింగ్‌కు చెందిన జట్టు నుంచి కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే మైదానంలో ఉంటారు. కానీ, ఇక్కడ భారత్ నుంచి ముగ్గురు బ్యాటర్లు గ్రౌండ్‌లో కనిపిస్తారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత రోజురోజుకూ సరికొత్త పుంతలు తొక్కుతోంది. సరదా కోసం క్రియేట్ చేసే డీప్‌ఫేక్ వీడియోలు ఫర్వాలేదు కానీ.. కొన్నిసార్లు రెండు దేశాల మధ్య, క్రీడాకారుల మధ్య లేనిపోని భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఇవి తయారవుతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. తాజాగా మహిళల ప్రపంచ కప్ (Women’s World Cup) లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు దేశాల ప్లేయర్లు మైదానంలో తీవ్రంగా గొడవ పడినట్లు, ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లినట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే, ఈ వీడియోపై క్రీడా విశ్లేషకులు, ఫ్యాక్ట్ చెక్ టీమ్స్ స్పందించాయి. వాస్తవానికి భారత్-పాక్ మ్యాచ్‌లో ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోలేదని, నెట్టింట సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియో కేవలం ఏఐ (AI) తో సృష్టించిన నకిలీ వీడియో అని తేల్చారు.
మైదానంలో గొడవ జరగకపోయినప్పటికీ.. మైదానం వెలుపల ఉన్న రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం మ్యాచ్‌పై స్పష్టంగా కనిపించింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు ఒకరికొకరు కరచాలనం (Shake Hand) చేసుకోలేదు.
సాధారణంగా మహిళల క్రికెట్‌కు పురుషుల క్రికెట్ అంత క్రేజ్ ఉండదనే అపవాదు ఉంది. కానీ, ఈ దాయాదుల పోరాటాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏకంగా 18 వేలకు పైగా ప్రేక్షకులు ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియానికి రావడం విశేషం. మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఒక గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌కు ఇంత భారీ సంఖ్యలో అభిమానులు రావడం ఇదే తొలిసారి. ఆ రకంగా ఈ మ్యాచ్ సరికొత్త రికార్డును సృష్టించింది.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jun 15, 2026 12:11 PM IST













