India A vs Sri Lanka A: వైభవ్ విధ్వంసం.. ఫైనల్‌లో శ్రీలంక చిత్తు.. ట్రై సిరీస్ భారత్ వశం! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

త్రికోణ సిరీస్ ఫైనల్లో శ్రీలంకపై 66 పరుగుల తేడాతో గెలిచి భారత ‘ఏ’ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 94 పరుగులతో చారిత్రాత్మక విధ్వంసం సృష్టించాడు. భారత్ 377 పరుగులు చేయగా, లంక 311 పరుగులకే ఆలౌట్ అయింది.

News18
News18

శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ‘ఏ’ జట్టు అద్భుత విజయం సాధించింది. ఆదివారం జరిగిన తుది పోరులో ఆతిథ్య శ్రీలంక ‘ఏ’ జట్టును 66 పరుగుల భారీ తేడాతో ఓడించి దర్జాగా ట్రోఫీని కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఏకంగా 377 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. కేవలం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ తిలక్ వర్మ 67 పరుగులతో, అనుకుల్ రాయ్ 39 పరుగులతో రాణించారు.

భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ‘ఏ’ జట్టు ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఆ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో వనుజ సహన్ 62 పరుగులు, సదీర సమరవిక్రమ 52 పరుగులు చేసి మాత్రమే కాసేపు పోరాడారు.

భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లంకను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. పేసర్ యశ్ ఠాకూర్, స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ అద్భుతంగా బౌలింగ్ చేసి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనుకుల్ రాయ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో భారత జట్టు సిరీస్ విజేతగా నిలిచి సత్తా చాటింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports