Last Updated:
Rakhis for PM Modi: బృందావన్ నుంచి ప్రత్యేక మహిళలు.. ప్రధాని మోదీకి 1100 రాఖీలు తయారు చేసి రక్షా బంధన్ వేడుకలు జరుపుకునేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్.. మథురా జిల్లా.. వృందావన్‌లోని వివిధ ఆశ్రమాల్లో నివసిస్తున్న వృద్ధ విధవ మాతలు.. ఈ సంవత్సరం రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా 1,100 రాఖీలు తయారుచేశారు. ఈ రాఖీలపై ప్రధానమంత్రి రంగురంగుల ఫొటోలను అలంకరించారు. సులభ్ ఇంటర్నేషనల్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందని సంస్థ కార్యనిర్వాహక సంయోజకురాలు నిత్యా పాఠక్ తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.














