Last Updated:
మహిళల ఆసియా కప్‌లో టీమిండియా అదరగొట్టింది. పాకిస్థాన్ నిర్దేశించిన 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, దాయాది జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో పాక్ నిర్దేశించిన 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీంతో దాయాది జట్టుపై 7 వికెట్ల తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది.














