Indian Railway: ఆ చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సిందేనన్న కోర్టు.. ప్రయాణికుడికి రూ.35వేలు పరిహారం | తెలంగాణ వార్తలు | ACTPnews

Railway: రైల్వే బోర్డు కీలక నిర్ణయం... ఉద్యోగులకు ఇంటి నిర్మాణ రుణంపై వడ్డీ రేటు ఫిక్స్ (ప్రతీకాత్మక చిత్రం)


Last Updated:

Hyderabad: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, అత్యాధునిక సేవలను కల్పిస్తున్న ఇండియన్ రైల్వే పలుమార్లు జరిగే చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంతే కాదు ప్రయాణికుల విలువైన సమయాన్ని, వాళ్ల అసౌకర్యానికి కారణమవుతుందనే విమర్శ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కేసులో తేలింది.

Railway: రైల్వే బోర్డు కీలక నిర్ణయం... ఉద్యోగులకు ఇంటి నిర్మాణ రుణంపై వడ్డీ రేటు ఫిక్స్ (ప్రతీకాత్మక చిత్రం)
Railway: రైల్వే బోర్డు కీలక నిర్ణయం… ఉద్యోగులకు ఇంటి నిర్మాణ రుణంపై వడ్డీ రేటు ఫిక్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Hyderabad: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, అత్యాధునిక సేవలను కల్పిస్తున్న ఇండియన్ రైల్వే పలుమార్లు జరిగే చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంతే కాదు ప్రయాణికుల విలువైన సమయాన్ని, వాళ్ల అసౌకర్యానికి కారణమవుతుందనే విమర్శ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కేసులో తేలింది. రైలు మార్గం మళ్లించడం వల్ల వ్యాపార సమావేశానికి హాజరుకాలేకపోయిన హైదరాబాద్ కొత్తపేటకు చెందిన ఓ ప్రయాణికుడికి రూ.35 వేల పరిహారం చెల్లించాలని సదరన్ రైల్వేను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రైల్వే నిర్లక్ష్యం, ప్రయాణికుడికి అసౌకర్యం..

దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ ఇండియన్ రైల్వే. నిత్యం భారతదేశంలోని అనేక మార్గాల్లో లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పించే ఈ సంస్థ అప్పుడప్పుడు జరిగే చిన్న పొరపాట్ల కారణంగా ప్రయాణికులకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది సుమారు రెండేళ్లు అంటే 2024లో సెప్టెంబర్ 30న ఢిల్లీలో జరిగే ఓ బిజినెస్ మీటింగ్ కోసం అటెండ్ అయ్యేందుకు దక్షిణ మధ్య రైల్వేను ఆశ్రయించాడు. అయితే రైలు మార్గం మళ్లించిన విషయాన్ని రైల్వే శాఖ అతనికి ముందుగానే తెలియజేయడంలో విఫలమైంది. దీనివల్ల ప్రయాణంలో 16 గంటల జాప్యం జరడం వల్ల తాను వెళ్లాల్సిన బిజినెస్ మీటింగ్‌కి అటెండ్ కాలేకపోవడంతో పాటు తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ మిస్ అయ్యాడు. దీంతో ఆయన పరిహారం కోరుతూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ సమయంలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కారణంగా రైలు మార్గాన్ని మళ్లించాల్సి వచ్చిందని సదరన్ రైల్వే పేర్కొంది. విజయవాడ, ఖమ్మం, వరంగల్, నాగ్‌పూర్ స్టేషన్లలో రైలు ఎక్కిన ప్రయాణికులకు మాత్రమే మార్గ మళ్లింపు గురించి SMS ద్వారా మెసేజ్ పంపారు. కాని చెన్నైలో రైలు ఎక్కిన వారికి మెసేజ్ పంపలేదని రైల్వే అధికారులు అంగీకరించారు.

రూ.35వేల పరిహారం..

దీంతో ప్రయాణికుడు రామకృష్ణ అభ్యర్ధనను కోర్టు పరిశీలించింది. ప్రయాణికుడికి సకాలంలో సమాచారం అందించడంలో రైల్వే శాఖ విఫలమైందని ముగ్గురు వ్యక్తులతో కూడిన కమిషన్ గుర్తించింది. ఒకవేళ ముందుగానే సమాచారం అంది ఉంటే ఫిర్యాదుదారు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉండేదని కమిషన్ పేర్కొంది. వ్యాపార నష్టాలకు సంబంధించి ప్రయాణికుడు తగిన ఆధారాలు సమర్పించలేదని కమిషన్ భావించినప్పటికీ, ఆయన పడిన మానసిక వేదన, అసౌకర్యం , తిరుగు ప్రయాణ విమానాన్ని కోల్పోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. దీంతో పరిహారంగా రూ.35,000 చెల్లించాలని సదరన్ రైల్వేను కమిషన్ ఆదేశించింది.

భారీ మూల్యం చెల్లించాల్సిందే..

కొత్తపేటకు చెందిన జీడిపప్పు వ్యాపారి రామకృష్ణ చెన్నై నుండి న్యూఢిల్లీకి వెళ్లే తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో. 1,428 చెల్లించి ‘ప్రీమియం తత్కాల్’ టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ ట్రైన్ దారి మళ్లించిన సమాచారం చేరవేయకపోవడం వల్ల రైల్వేశాఖ భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *