Indian Railway: ట్రైన్ జనరల్ కంపార్ట్‌మెంట్లో ప్రయాణికుడు నీచమైన పని.. పక్కనే ఆడవాళ్లు ఉంటే సిగ్గులేదు | ట్రెండింగ్ | ACTPnews

Indian Railway


Last Updated:

Indian Railway: మన దేశంలో ఇండియన్ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ. సాధారణ ప్రజలు, పేద, మధ్యతరగతి వాళ్లతో పాటు అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సి వస్తే టికెట్ కొనుక్కొని జనరల్ బోగీల్లోనే జర్నీ చేస్తుంటారు. అయితే రైల్వేలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు మెరుగైన వసతులు కల్పిస్తున్నప్పటికి జనరల్ బోగీల్లో వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

Indian Railway
Indian Railway

Indian Railway: మన దేశంలో ఇండియన్ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ. సాధారణ ప్రజలు, పేద, మధ్యతరగతి వాళ్లతో పాటు అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సి వస్తే టికెట్ కొనుక్కొని జనరల్ బోగీల్లోనే జర్నీ చేస్తుంటారు. అయితే రైల్వేలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు మెరుగైన వసతులు కల్పిస్తున్నప్పటికి జనరల్ బోగీల్లో వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా బీహార్‌కి చెందిన ఓ నడి వయసున్న వ్యక్తి ట్రైన్‌ జనరల్ బోగీలో తోటి ప్రయాణికులు చూస్తుండగానే ముత్ర విసర్జన చేశాడు. కూర్చొవడానికి కూడా స్థలం లేకుండా నిల్చున్నారు తోటి ప్రయాణికులు. మహిళలు, చిన్నపిల్లలు సైతం చూస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఇంతటి నీచమైన పనికి పాల్పడటంతో అప్పటి వరకు ఓపికతో భరించిన వాళ్లంతా తర్వాత చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. రైళ్లలో కనీసం ఇంగితజ్ఞానం లేకుండా స్పృహతప్పి ప్రవర్తించే ఇలాంటి వారిని రైళ్లలో ఎక్కనివ్వకూడదని జనం సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు.

జనరల్ బోగీలో మూత్రం పోయడం ఏంటీ..

రైళ్లలో ప్రయాణం అంటేనే చాలా మంది అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఫీలవుతారు. ఎందుకంటే తోటి ప్రయాణికులు చేసే చర్యలు, వారి ప్రవర్తనతో విసిగిపోతుంటారు. రిజర్వేషన్‌ కంపార్ట్‌మెంట్లలో కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. కాని జనరల్ బోగీలో ప్రయాణించే వారికి నరకం కనిపిస్తుంది. సీటు దొరికినప్పటికి పదే పదే మిగిలిన ప్రయాణికులు తిరగడం, పెద్ద పెద్దగా మాట్లాడుకోవడం, సీటు కోసం గొడవపడటం చూస్తుంటాం. కాని బీహార్‌కి చెందిన ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులు అసహ్యించుకునేలా ప్రవర్తించాడు. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో తోటి ప్రయాణికులు నిలుచున్న చోటే ఏమాత్రం సిగ్గు లేకుండా మూత్రం పోసుకున్నాడు. అక్కడున్న వాళ్లంతా ఏం పని ఇదీ అంటూ హెచ్చరిస్తున్నప్పటికి పట్టించుకోకుండా మూత్రవిసర్జన చేశాడు.

తోటి ప్రయాణికులు ఆగ్రహం..

ట్రైన్‌ బోగీలో మూత్రం పోసిన వ్యక్తి నడి వయసు ఉండటమే కాకుండా మద్యం తాగిన మత్తులో ఉన్నట్లుగా గుర్తించిన తోటి ప్రయాణికులు అతడి చేష్టలకు ఉడికిపోయారు. అప్పటి వరకు ఓపికగా చెప్పిన వాళ్లంతా అతడ్ని పట్టుకొని చితకబాదారు. రైల్వే సిబ్బందితో పాటు మన దేశంలో పౌరులకు కనీసం పబ్లిక్‌ పేసుల్లో ఎలా ప్రవర్తించాలో అనే స్పృహ కూడా కోల్పోతున్నారని తిట్టిపోస్తున్నారు. సామాన్యులు పశువుల్లా ప్రయాణిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడా? అని విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

చితకబాదిన వీడియో వైరల్..

సాధారణంగా రైలులోని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులు సీటు కోసం లేదంటే కాళ్లు తుగులుతున్నాయని గొడవపడటం చూస్తుంటాం. కాని ఈవీడియోలో బీహార్‌కి చెందిన ఓ వ్యక్తి వాష్‌రూమ్‌లో చేయాల్సిన మూత్రవిసర్జన సీటు దగ్గర చేయడం నిజంగా క్షమించరాని నేరంగా చూడాలని.. ఇలాంటి వాళ్లను పొరపాటున కూడా జీవితంలో ట్రైన్ ఎక్కకుండా చర్యలు తీసుకోవాలని.. భారీ ఫైన్ వసూలు చేసి జైల్లో పెట్టాలని సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed